ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి త‌ల‌సాని

విధాత‌, హైదరాబాద్: ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారుమంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ 107వ జయంతిలో మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మహానీయులను మరింత ఉన్నతంగా గౌరవిస్తుందన్నారు. తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా కొండా లక్ష్మణ్ మార్చారని తెలిపారు. ఒక్క పద్మశాలీల కోసమే పోరాడలేదని… అన్ని వర్గాల […]

ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి త‌ల‌సాని

విధాత‌, హైదరాబాద్: ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారుమంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ 107వ జయంతిలో మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మహానీయులను మరింత ఉన్నతంగా గౌరవిస్తుందన్నారు.

తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా కొండా లక్ష్మణ్ మార్చారని తెలిపారు. ఒక్క పద్మశాలీల కోసమే పోరాడలేదని… అన్ని వర్గాల పక్షాన పోరాడిన గొప్ప నాయకులని కొనియాడారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళలకు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను చేనేతలు తయారీ చేసినవే అని చెప్పుకొచ్చారు. వచ్చే సంవత్సరం నుండి కొండా లక్ష్మణ్ జయంతి గొప్ప పండుగగా ఘనంగా జరపాలని మంత్రి అన్నారు.