కారులో అల్లోల కల్లోలం.. బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. బీఎస్పీతో బీఆరెస్ పొత్తును వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప
విధాత : బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. బీఎస్పీతో బీఆరెస్ పొత్తును వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆరెస్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌లో చేరిక కోసమే ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లుగా సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పాల్వయి హరీష్ చేతిలో ఓడిపోయారు. బీఎస్పీతో బీఆరెస్ పొత్తును కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిర్పూర్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థగా ఉన్న ఆరెస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని కోనప్ప జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర అసంతృప్తితో కోనప్ప బీఆరెస్‌కు గుడ్‌బై కొట్టి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
అటు బీఆరెస్‌లో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు కూడా బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. బీఎస్పీతో బీఆరెస్ పొత్తు పెట్టుకోవడాన్ని కారణంగా చూపి వారు కారు దిగే ప్రయత్నంలో ఉన్నట్లుగా గులబీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది