Balka Suman | కోటపల్లి మండలాన్ని కోనసీమగా మార్చుతా: ఎమ్మెల్యే బాల్క సుమన్
విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలాన్ని మరో కోనసీమలాగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు పట్టణంలోని MRR గార్డెన్స్ లో నిర్వహించిన కోటపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనములో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కోటిపల్లి మండలం భౌగోళికంగా విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నందున అందులో రెండు మండలాలుగా విభజించి పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని అన్నారు. కోటపల్లి […]

విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలాన్ని మరో కోనసీమలాగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు పట్టణంలోని MRR గార్డెన్స్ లో నిర్వహించిన కోటపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనములో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
కోటిపల్లి మండలం భౌగోళికంగా విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నందున అందులో రెండు మండలాలుగా విభజించి పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని అన్నారు. కోటపల్లి మండలాన్ని విభజన చేసి పారిపెల్లిని కొత్త మండలంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రెండు మండలాలు అభివృద్ధిలో పరిగెత్తే విధంగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు కోటపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇప్పటికే కోటపల్లి మండలంలో వాగులపై ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని తెలిపారు.తుంతుంగ వాగుపై 8 కోట్లతో బ్రిడ్జ్ నిర్మించామని ఈ బ్రిడ్జి వల్ల కోటపల్లి మండలంలోని ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యల పల్లి, ఆల్గామా, జనగామ, వెంచపల్లి గ్రామాల దశాబ్దాల కష్టాలు తొలగిపోయాయని అన్నారు.
పంగిడి సోమారం ప్రజల దశాబ్దాల కల శంకరాపురం – పంగిడిసోమారం వరకు 6.24 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి . ఇందులో రెండు బ్రిడ్జిలు ఒక కల్వర్టు కూడా నిర్మించడం జరిగినదని అన్నారు. 2.5 కోట్లతో చెన్నూరు నుండి కోటపల్లి వెళ్లే దారిలో పాలవాగుపై బ్రిడ్జి పూర్తి చేసి వెంచపల్లి – సూపక మధ్యలో మత్తడిఒర్రె పైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామని అనేక బ్రిడ్జిలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవ చేశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి, ఇంచార్జ్ నారాదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.