పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు

విధాత: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించిన బీజేపీ రాజకీయంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీది ఫేక్ రాజకీయం అని దుయ్యబట్టారు. మొత్తం ఫేకుడే.. పైనున్నడో ఫేకుడు.. కిందున్నోడు జోకుడు తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 12కు 12తో.. గులాబీ వనమైన ఉమ్మడి నల్లగొండ డబ్బులు […]

  • By: krs    latest    Nov 06, 2022 3:50 PM IST
పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు

విధాత: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించిన బీజేపీ రాజకీయంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీది ఫేక్ రాజకీయం అని దుయ్యబట్టారు. మొత్తం ఫేకుడే.. పైనున్నడో ఫేకుడు.. కిందున్నోడు జోకుడు తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

12కు 12తో.. గులాబీ వనమైన ఉమ్మడి నల్లగొండ

డబ్బులు ఇచ్చి కొందరు అభ్యర్థులను నిలబెట్టారు. గుర్తులను పోలిన గుర్తులు రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ను తీసుకువచ్చి దాదాపు 6వేల ఓట్లు వాళ్లకు పడేలా కన్ఫూజన్‌కు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇంకా దారుణం ఏంటంటే ఫేక్‌ ప్రచారాలు. బీజేపీ ప్రచారం అంటేనే.. ఒక ఆర్ట్‌ కింద మారిపోయింది. ఫేక్‌ అనేది లేకుంటే ప్రచారం ఉండదు.. ఆల్‌ ఫేక్‌ పార్టీ బీజేపీ పైనుంచి కింది వరకు.

ఈటల, కోమటిరెడ్డితోనే ఎన్నికలు ధనమయం: కేటీఆర్ ఫైర్

పోటీలో దొంగ ఇండిపెండెంట్లను నిలబెట్టి శిఖండి రాజకీయం చేశారు. వారికి కేటాయించిన గుర్తులు ఫేక్‌. రూ.3వేల పింఛన్‌ హామీ ఫేక్. రూ.1000కోట్ల నిధులు తెస్తానని చెప్పడం ఫేక్‌. అభ్యర్థికి అర్జెంట్‌గా జ్వరం రావడం ఫేక్‌. కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరిందన్న ప్రచారం ఫేక్‌. మా పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ బీజేపీలో చేరుతున్నాడని అడ్డగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్‌.

పోలింగ్‌ రోజు న్యూస్‌ చానల్స్‌, పత్రికల పేరుతో, కొత్త కొత్త సర్వేలతో చేసిన ప్రచారం ఫేక్‌. ఎన్నికల సందర్భంగా జరిగిన ఐటీ దాడులు, దాని వెనుక జరిగిన ప్రచారం ఫేక్‌. మా మంత్రి జగదీష్‌రెడ్డి ఏపీ వద్ద డబ్బులు దొరికాయన్నది ఫేక్‌. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో లేని ఓటును వేసినట్లుగా చెప్పడం అదొక ఫేక్‌ రాజకీయం.

నల్లగొండ జిల్లా ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం: మంత్రి కేటీఆర్

మొత్తం ఫేకుడే.. పైనున్నడో ఫేకుడు.. కిందున్నోడు జోకుడు తప్ప చేసిందేమీ లేదు. అక్కడున్నోడు నేను కరోనా వ్యాక్సిన్‌ కనిపెట్టామని ఒకడు చెబుతడు.. ఇంకొకుడు రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఆపిండని చెబుతడు. ఇంత దరిద్రమైన పద్ధతి అంటే.. మా ఓటర్ల వద్దకు వెళ్లి.. మహిళ ఓటర్ల చేతులకు గోరింటాతో కమలం పువ్వు గుర్తు వేయడం కంటే చిల్లర పని ఉంటదా? దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్టాడాలి.

ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఎన్నికల కమిషన్‌పైనా దాడి చేస్తున్నరు. ఎన్నికల కమిషన్‌ ఇవాళ ఎవరి ఆధీనంలో ఉన్నది? ఎవని ఆధీనంలో పని చేస్తుందో ఇక్కడున్న బీజేపీ అధ్యక్షుడికి తెలియదు. ఆయనకు ఎవరు సైతం చెబుతలేరు. నోటికి ఎంత వస్తే అంత ఒర్రుడే.

ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా.. బీజేపీ గవర్నమెంట్‌ కింద పని చేస్తుంది ఢిల్లీలో.. వాళ్లను తిడుతున్న వంటే మోదీని తిడుతున్నట్టే లెక్కా.. అది కూడా తెల్వదు ఆయనకు. బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెబినందుకు మునుగోడు ప్రజలకు, గులాబీ శ్రేణులు, కామ్రేడ్‌ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.