కోతికి జీవిత ఖైదు!.. వార్ని ఇదేందయ్య ఇది నేనెప్పుడు వినలా
విధాత: హత్య, అత్యాచారం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఓ కోతి జీవిత ఖైదు అనుభవిస్తూ ఊచలు లెక్కపెడుతున్నది. ఇంతకూ అది చేసిన నేరమేంటయా అంటే మనుషులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చడమే. అది అలా ఎందుకు చేస్తున్నదంటే.. దానికీ ఒక పెద్ద కథ ఉంది. కాలియా అనే కోతి మీర్జాపూర్లో ఓ మాంత్రికుని దగ్గర మాంసం, మద్యానికి అలవాటయ్యింది. నిత్యం అతని దగ్గరే ఉంటూ మద్యం […]

విధాత: హత్య, అత్యాచారం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఓ కోతి జీవిత ఖైదు అనుభవిస్తూ ఊచలు లెక్కపెడుతున్నది. ఇంతకూ అది చేసిన నేరమేంటయా అంటే మనుషులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చడమే. అది అలా ఎందుకు చేస్తున్నదంటే.. దానికీ ఒక పెద్ద కథ ఉంది.
కాలియా అనే కోతి మీర్జాపూర్లో ఓ మాంత్రికుని దగ్గర మాంసం, మద్యానికి అలవాటయ్యింది. నిత్యం అతని దగ్గరే ఉంటూ మద్యం తాగేది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ మాంత్రికుడు చనిపోవటంతో కోతికి కష్టాలొచ్చి పడ్డాయి. మాంసం, మత్తుకు అలవాటు పడ్డ కోతికి ఆకలి తీరటం కష్టమైంది.
మద్యానికి అలవాటు పడ్డ కోతి మతి, గతి తప్పి మనుషులపై దాడి చేసింది. అలా ఒక్కటి కాదు, రెండు కాదు 250మందికి పైగా ఆ కోతి బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో అక్కడి అధికారులు దాన్ని బంధించి జూకు తరలించారు. దానికి మానసిక చకిత్స కూడా అందించారు. అయినా కోతిలో మార్పు రాలేదు. జూలో బంధించి ఐదేండ్లు గడుస్తున్నా మార్పు రాకపోవటంతో దాన్ని జీవితాంతం జూలో బంధీగానే ఉంచుతామని అదికారులు అంటున్నారు.