మీరు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుంది: ప్రధాని మోడీ
అసలైన లౌకికత్వం అంటే ఏమిటో చూపెట్టాం విధాత: అందరి కోసం పని చేయడమే అసలైన లౌకికత్వమని, అది అంటే ఏమిటో తాము చూపించాం. వివక్ష లేకుండా అన్నివర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేశాం, సామాన్యుల సంక్షేమ మా ప్రాధాన్యమని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతుండగా.. విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. వెల్‌లోకి దూసుకొచ్చి ఎంపీలు నినాదాలు చేశారు. నిరసనల మద్యే ఆయన మాట్లాడారు. కొందరు […]

అసలైన లౌకికత్వం అంటే ఏమిటో చూపెట్టాం
విధాత: అందరి కోసం పని చేయడమే అసలైన లౌకికత్వమని, అది అంటే ఏమిటో తాము చూపించాం. వివక్ష లేకుండా అన్నివర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేశాం, సామాన్యుల సంక్షేమ మా ప్రాధాన్యమని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతుండగా.. విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. వెల్‌లోకి దూసుకొచ్చి ఎంపీలు నినాదాలు చేశారు. నిరసనల మద్యే ఆయన మాట్లాడారు.
కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తున్నది. నినాదాలు చేస్తున్న వారు దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన ప్రతిపక్షాలకు లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ముఖ్యమైన సభలో ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు.
మీరు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎంత అడ్డుకున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకడుగు వేయమన్నారు. దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని మోడీ మండిపడ్డారు.
సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చాం. మేం సామాన్యుడి ముంగిటకు పథకాలు తీసుకొచ్చాం. 18 వేలకు పైగా గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపాం. మేం దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాం. మారుమూల పల్లెలను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాలకు పైగా గరీబీ హఠావో నినాదంతోనే కాలం వెళ్లబుచ్చింది.
అందరి కోసం పని చేయడమే అసలైన లౌకికత్వమని, అది అంటే ఏమిటో మేం చూపించాం. వివక్ష లేకుండా అన్నివర్గాలవారికి సంక్షేమ ఫలాలు అందేలా చేశాం. సామాన్యుల సంక్షేమమే మా ప్రాధాన్యం. మా పాలనలో 25 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించాం. తొలిసారిగా మేం ఆదివాసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. వారికోసం ఐదు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చుచేశాం. ఆదివాసీల కోసం బడ్జెట్‌లో 1.20 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు.