Manchu Lakshmi: ఆ విమానం ప్రమాదం నుంచి లక్కీగా బయటపడ్డా : మంచులక్ష్మి

Manchu Lakshmi: ఆ విమానం ప్రమాదం నుంచి లక్కీగా బయటపడ్డా : మంచులక్ష్మి

Manchu Lakshmi:  దేవుడి దయ వల్ల నేను ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని నటి మంచు లక్ష్మి ఓ వీడియోలో తెలిపారు. ఆహ్మదాబాద్ విమానం ప్రమాదం జరిగిన రో జునే తాను ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించానని చెప్పారు. కానీ తాను ముంబై నుంచి లండన్ వెళ్లినట్లు చెప్పారు. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను క్షేమంగా ఉన్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రమాదం జరిగిన రోజున నేను ఎయిరిండియా విమానంలోనే లండన్ వెళ్లడంతో నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయని లక్ష్మి తెలిపారు.

నేను,  నా కూతురు అదేరోజు ముంబై నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశామని.. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డానన్నారు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరంగా ఉందని..మెడికల్ విద్యార్థులు కూడా మృతిచెందారని తెలిసి నా హృదయం ముక్కలైందన్నారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని.. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ అని లక్ష్మి అన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు లక్ష్మి చెప్పారు.