మనమే భయపడితే ఎలా? : సీజేఐ
విధాత: భారతదేశంలోని అన్ని వ్యవస్థల్లో న్యాయవ్యవస్థది ప్రత్యేక స్థానం. అలాంటి వ్యవస్థని నడిపించే మనం కూడా భయపడితే నిస్పక్షపాతంగా న్యాయం అందించగలమా.. అర్హులకు బెయిల్ ఇవ్వగలమా.. అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. చాలా సందర్భాల్లో జిల్లా స్థాయి జడ్జీలు న్యాయబద్ధంగా వ్యవహరించే పరిస్థతి లేకపోవడం బాధాకరమన్నారు. సీజేఐ మాటలు ప్రస్తుతం దేశంలో ఉన్న స్థితికి అద్దం పడుతున్నదని చెప్పవచ్చు. సామాజిక, రాజకీయ పరిస్థితులు కోర్టులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని […]

విధాత: భారతదేశంలోని అన్ని వ్యవస్థల్లో న్యాయవ్యవస్థది ప్రత్యేక స్థానం. అలాంటి వ్యవస్థని నడిపించే మనం కూడా భయపడితే నిస్పక్షపాతంగా న్యాయం అందించగలమా.. అర్హులకు బెయిల్ ఇవ్వగలమా.. అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
చాలా సందర్భాల్లో జిల్లా స్థాయి జడ్జీలు న్యాయబద్ధంగా వ్యవహరించే పరిస్థతి లేకపోవడం బాధాకరమన్నారు. సీజేఐ మాటలు ప్రస్తుతం దేశంలో ఉన్న స్థితికి అద్దం పడుతున్నదని చెప్పవచ్చు.
సామాజిక, రాజకీయ పరిస్థితులు కోర్టులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చాలా కేసుల సందర్భాల్లో రుజువయింది. న్యాయ వ్యవస్థకి సహజ న్యాయ సూత్రాలు, ధర్మాలు ఎన్ని ఉన్నా.. ఎలా ఉన్నా.. నాటి రాజకీయ పరిస్థితులే అన్నింటినీ నిర్దేశించే పరిస్థితి ఉండడం విషాధకరం.