12 మందిని చేసుకుండు..100 మందిని కన్నడు

2 ఎక‌రాల భూమితో జీవ‌న ప‌య‌నం ఆయ‌న పిల్ల‌లు 10 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వ‌ర‌కు.. విధాత‌: పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. ఒకప్పుడు వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని కాలంలో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేవి. దీంతో జనాభా నియంత్రణకు ప్రభుత్వాలేమీ చర్యలు చేపట్టలేదు. కానీ రానురాను వైద్య రంగం అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య […]

12 మందిని చేసుకుండు..100 మందిని కన్నడు
  • 2 ఎక‌రాల భూమితో జీవ‌న ప‌య‌నం
  • ఆయ‌న పిల్ల‌లు 10 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వ‌ర‌కు..

విధాత‌: పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. ఒకప్పుడు వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని కాలంలో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేవి. దీంతో జనాభా నియంత్రణకు ప్రభుత్వాలేమీ చర్యలు చేపట్టలేదు. కానీ రానురాను వైద్య రంగం అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో పెరుగుతున్న జనాభా నియంత్రించడానికి ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాయి.

అలాగే జనాభా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక్కరు చాలు.. ఇంటికి ఇద్దరు ముద్దు అనేవి ప్రచారం చేశాయి. చైనాలో అయితే ఏకంగా ఒక్కరిని మాత్రమే కనాలని ఆ దేశ ప్రభుత్వం కఠిన నిబంధనలు ఎత్తివేసింది. ప్రస్తుతం అక్కడ యువ జనాభా తగ్గిపోతుండంతో పిల్లల్ని కనాలని అంటున్నది. పెళ్లి కాకున్నా పిల్లలను కలిగి ఉండొచ్చని తెలిపింది. అయినా ప్రజలు మాత్రం ఎక్కువ మంది ఉంటే పిల్లల పోషణ భారంగా మారుతుందని ఒక్కరికే పరిమితమవుతున్నారు.

పిల్లల సంగతి పక్కనపెడితే పెళ్లి కాని ప్రసాదులు కూడా చాలామంది ఉన్న కాలం ఇది. కానీ తన వంశాభివృద్ధి కోసం పెద్దల మాటలు విని ఉగాండ దేశంలోని బుగిసాలో ఒక వ్యక్తి ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుని వంద మంది పిల్లలను కని వార్తల్లో నిలిచాడు. ఆయన పేరు ముసా హసహ్య.

తనకు ఉన్న రెండెకరాల పొలంతో వంద మందికి పైగా ఉన్న కుటుంబానికి కనీస అవసరాలు కూడా సమకూర్చలేకపోతున్నాడు. దీంతో ఇక పిల్లలు వద్దు బాబోయి అంటున్నాడు. పిల్లలకు సరైన తిండి, బట్టలు కూడా కొనివ్వలేని స్థితి నెలకొన్నది. దీంతో విసిగిపోయిన ఆయన ఇద్ద‌రు భార్యలు హసహ్యను వదిలివెళ్లారు.

17 ఏళ్ల వయసులో 1972లో మొదటి వివాహనం చేసుకున్న ముసాకు పెళ్లైన ఏడాదిలోనే మొదటి బిడ్డ సాండ్రా జన్మించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఆయన పిల్లల్లో పదేళ్ల నుంచి 50 మధ్య వారు ఉంటే.. ఆయన చిన్న భార్య వయసు 35 ఏళ్లు కావడం గమనార్హం. వంద మందిని కన్న ముసాకు తన పిల్లల్లో చాలామంది పేర్లు గుర్తుండవట. పిల్లలను గుర్తించడానికి వారి తల్లుల సాయం తీసుకుంటాడట సెంచరీ సంతాన వీరుడు హసహ్య.