మునుగోడు: ఇప్పర్తిలో కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ.. TRSలోకి భారీగా వలసలు

పాల చైర్మన్‌తో సహా గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్,బీజేపీ శ్రేణులు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి అహ్హనించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న టీఆర్ఎస్ నేత భవనం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొజ్జా సుజాత శ్రీను తదితరులు విధాత: మునుగోడు నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో గులాబీ శ్రేణులు ఒకవైపు కుటుంబ సభ్యులతో సహా పండుగ వాతావరణంలో పాలు పంచుకుంటుండగా, మరోవైపు టీఆర్ఎస్‌లోకి వలసల ప్రవాహం […]

  • By: krs    latest    Sep 26, 2022 12:08 PM IST
మునుగోడు: ఇప్పర్తిలో కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ.. TRSలోకి భారీగా వలసలు
  • పాల చైర్మన్‌తో సహా గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్,బీజేపీ శ్రేణులు
  • పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి అహ్హనించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • పాల్గొన్న టీఆర్ఎస్ నేత భవనం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొజ్జా సుజాత శ్రీను తదితరులు

విధాత: మునుగోడు నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో గులాబీ శ్రేణులు ఒకవైపు కుటుంబ సభ్యులతో సహా పండుగ వాతావరణంలో పాలు పంచుకుంటుండగా, మరోవైపు టీఆర్ఎస్‌లోకి వలసల ప్రవాహం కొనసాగుతుంది.

ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఇప్పర్తి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకీ చెందిన పాల సొసైటీ చైర్మన్ చీమల వరుణ్ యాదవ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు ఈరటి శ్రీశైలం, పెద్ద గొల్ల బూడిద నరసింహా యాదవ్, బచ్చనగోని లింగస్వామి, ఈరటి శంకర్,ఆడెపు ప్రశాంత్, బొజ్జ యాదయ్య, ఆడిమయ్యా, బబుల్, కట్ట రమేష్, బద్ధుల శేఖర్, పాసు సాయిచందు తదితరులు టీఆర్ఎస్‌లో చేరారు.

పార్టీలో చేరిన వారికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్హనించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు భవనం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సుజాత శ్రీను, పంచాయతీ సభ్యులు నరేందర్, సైదులు, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.