మైహోమ్ సిమెంట్స్ అక్రమ నిర్మాణాలు సీజ్

విధాత: మైహోమ్ సిమెంట్స్ అక్రమ నిర్మాణాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా మైహోమ్ సిమెంట్ పరిశ్రమ అక్రమ నిర్మాణాలపై శనివారం దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణ పనులను సీజ్ చేశారు. మైహోమ్ సిమెంట్స్ నూతన ప్లాంట్ యూనిట్-4 కట్టడాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ నిర్మాణ పనులను నిలిపివేశారు. లేఅవుట్, డిటిసిపి అప్రూవల్ లేకుండా చేపడుతున్న […]

మైహోమ్ సిమెంట్స్ అక్రమ నిర్మాణాలు సీజ్

విధాత: మైహోమ్ సిమెంట్స్ అక్రమ నిర్మాణాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా మైహోమ్ సిమెంట్ పరిశ్రమ అక్రమ నిర్మాణాలపై శనివారం దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణ పనులను సీజ్ చేశారు.

మైహోమ్ సిమెంట్స్ నూతన ప్లాంట్ యూనిట్-4 కట్టడాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ నిర్మాణ పనులను నిలిపివేశారు. లేఅవుట్, డిటిసిపి అప్రూవల్ లేకుండా చేపడుతున్న నిర్మాణ పనులకు గతంలోనే రెండుసార్లు పనులు నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు.

పరిశ్రమ నిర్మాణాలకు సంబంధించిన పూర్తి అనుమతులు తీసుకొని తదుపరి నిర్మాణాలు చేపట్టాలంటూ సూచించారు. అయితే గ్రామపంచాయతీ నోటీసులు లెక్కచేయని మైహోమ్ యాజమాన్యం తీరుపై ఆగ్రహించిన జిల్లా పంచాయతీరాజ్ శాఖ యంత్రాంగం సుమారు 20 మంది అధికారులు, సిబ్బందితో శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో దాడులు నిర్వహించారు. ఐదు గంటల సోదాల అనంతరం బయటకు వచ్చిన అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిపిఓ యాదయ్య మాట్లాడుతూ మై హోమ్ సిమెంట్స్ నూతన ప్లాంట్ యూనిట్ -4నకు సంబంధించిన నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. మైహోమ్ యాజమాన్యం నుండి లిఖితపూర్వకంగా పనులు నిలిపివేసినట్లు వివరణ తీసుకున్నామన్నారు.