Medak | తెలంగాణలో BRS హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి హరీశ్‌రావు

BRS, Medak 11 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన సభలు హాజరైన కార్యకర్తలు, నాయకులు.. విధాత, మెద‌క్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో బీఆర్‌యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సభ ఆయా ఎమ్మెల్యేల అధ్యక్షతన జరిగింది. గ్రామ గ్రామాన పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజా ప్రతినిధులు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నియోజకవర్గం సభలో పాల్గొన్నారు. సిద్దిపేట శివారులోని […]

Medak | తెలంగాణలో BRS హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి హరీశ్‌రావు

BRS, Medak

  • 11 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన సభలు
  • హాజరైన కార్యకర్తలు, నాయకులు..

విధాత, మెద‌క్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో బీఆర్‌యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సభ ఆయా ఎమ్మెల్యేల అధ్యక్షతన జరిగింది. గ్రామ గ్రామాన పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజా ప్రతినిధులు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నియోజకవర్గం సభలో పాల్గొన్నారు.

సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్ వద్ద BRS నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంత‌రం మంత్రి మాట్లాడారు.

ఈ రోజు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ పడ్డ శ్రమ అన్నారు.
తెలంగాణలో ఆకుపచ్చ చరిత్ర రాశారు సీఎం కేసీఆర్.. కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ జాతికి అంకితం చేశారన్నారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్ కు కొత్తకాదన్నారు.

తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్ర మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నిర్వహించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు.
BRS ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది. 57 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వరి సాగు.. దేశంలో అత్యధికంగా వరి సాగు తెలంగాణలోనే పండుతుందన్నారు.

కేసీఆర్ పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదనీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతి ఢిల్లీలో మెచ్చుకుంటారు, ఇక్కడ తిడతారని దుయ్యబట్టారు. మోడీ తప్పులను ఎత్తి చూపితే తిడతారు.. అడిగితే ఈడీలు, ఐటీలు, సిబిఐ లను ఉసిగొల్పుతారనీ మంత్రి మండి పడ్డారు.

దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ కు జేజేలు పలుకుతున్నార‌న్నారు. కేసీఆర్ ద్వారా తెలంగాణ ఖ్యాతి, గౌరవం పెరుగుతోంది. ఏనాటికైనా కేసీఆర్ కు తెలంగాణ మీద ఉండే ప్రేమ, మోడీకి ఉంటుందా ? రాహుల్ గాంధీకి ఉంటుందా ? అని సభలో ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్ ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం వల్లనే అట్టడుగున ఉన్న తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపాడు. నిజాలను ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రచారం చేయాలి, లేదంటే అబద్ధాలు రాజ్యం ఏలుతాయని అంబెడ్కర్ చెప్పాడనీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు ఎన్నికల నినాదాలు నేడు కళ్ళ ముందు నిజాలుగా మారాయి…

అయ్యా మోడీ.. మాన్ కీ బాత్ కాదు మా కిసాన్ బాత్ వినండి. సమాధులు తవ్వాలని ఒకడు, భవనాలు కూలకొడతానని ఇంకొకడు అంటాడు.. కూల గొట్టే వాళ్ళు కావాలెనా లేక ప్రగతి పునాదులు వేసే వారు కావాలో తేల్చుకోవాలనీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

BRS
BRS

మెదక్ జిల్లా కేంద్రంలో BRS పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సీఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లోని మైదానంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభకు నియోజకవర్గంలోని మెదక్ రామయంపేట చిన్న శంకరంపేట, పాపన్నపేట, నిజాంపేట, మెదక్ టౌన్ నుండి భారీగా ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు.

ముందుగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమించి తెలంగాణ సాధించిన వ్యక్తిగా టిఆర్ఎస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు.

మూడవసారి కేసీఆర్ నేతృత్వంలోని BRS పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలో గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 12 తీర్మానాలను ఆమోదించారు.

కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు. మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మెదక్ రామయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్ జితేందర్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పుట్టి విజయలక్ష్మి అంజిరెడ్డి అమర సేనా రెడ్డి లక్ష్మారెడ్డి సుజాత పలు తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించారు. ఈ సమావేశానికి ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు రైతు సమన్వయ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి, మాణిక్యరావు ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సభ జరగగా దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డిలో చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సభలు జరిగాయి ఆయాసభలలో జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.