Medak | రైతు ఆత్మహత్యలపై కదం తొక్కిన కాంగ్రెస్.. భారీ ర్యాలీ

Medak బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యలు.. తెలంగాణ పీసీసీ నేతలు సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలను ఆదుకోవాలని మెదక్ లో భారీ ఆందోళనకు దిగింది. బుధవారం నాడు పట్టణంలోని వెల్కమ్ బోర్డు నుండి జిల్లా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించింది. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో […]

Medak | రైతు ఆత్మహత్యలపై కదం తొక్కిన కాంగ్రెస్.. భారీ ర్యాలీ

Medak

  • బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
  • ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యలు..
  • తెలంగాణ పీసీసీ నేతలు సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలను ఆదుకోవాలని మెదక్ లో భారీ ఆందోళనకు దిగింది. బుధవారం నాడు పట్టణంలోని వెల్కమ్ బోర్డు నుండి జిల్లా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించింది. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో కలిసి చేసిన‌ ర్యాలీలో భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని ఆందోళనకు దిగారు.

అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

తెలంగాణ పిసిసి నేతలు సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా కదులుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను, బారికేడ్లను దాటుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదిలారు. కలెక్టర్ బయటకు రావాలంటూ ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్ష సమావేశంలో ఉండగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తన చాంబర్లోకి కాంగ్రెస్ నేతలు సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణతోపాటు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు విన‌తిప‌త్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

రైతు ఆత్మహత్యలకు ఎమ్మెల్యే పద్మ బాధ్యత వహించాలి

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన రెండు నెలల కాలంలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు సుప్రభాత రావు, మ్యాడమ్ బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎమ్మెల్యే ఇప్పటివరకు పరామర్శించలేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం అందించాల్సినప్పటికీ ఇప్పటివరకు కనీసం విచారణ కూడా చేయడం లేదన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై విచారణ జరిపించి తక్షణమే వారికి పరిహారం అందజేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో అర్కెల, షేర్ పల్లి, జక్కన్నపేట బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్, చిన్న శంకరంపేట వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీలు శివకుమార్, ప్రసాద్ గౌడ్,గొండ స్వామి, నార్సింగ్ మండల అధ్యక్షుడు గోవర్ధన్,హవేలి ఘనపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్, పాపన్నపేట మండలం నాయకులు పంతులు భూమన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు భరత్ గౌడ్,అనుదీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిసర ప్రాంత రైతులు తదితరులు పాల్గొన్నారు.