పీసీసీ జట్టులో మెదక్ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం
మెదక్, సిద్దిపేట జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా తిరుపతి రెడ్డి, నర్సారెడ్డి పెండింగ్‌లో సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి! విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: టీపీసీసీ కమిటీ ప్రకటించిన జాబితాలో మెదక్ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. మెదక్, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా తిరుపతి రెడ్డి, నర్సారెడ్డికి రెండోసారి పదవులు దక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నితంగా ఉండే ఈ ఇద్దరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు వరించాయి. కాగా సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష […]

- మెదక్, సిద్దిపేట జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా తిరుపతి రెడ్డి, నర్సారెడ్డి
- పెండింగ్‌లో సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి!
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: టీపీసీసీ కమిటీ ప్రకటించిన జాబితాలో మెదక్ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. మెదక్, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా తిరుపతి రెడ్డి, నర్సారెడ్డికి రెండోసారి పదవులు దక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నితంగా ఉండే ఈ ఇద్దరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు వరించాయి. కాగా సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి ఎవరిని నియమించకుండా పెండింగ్‌లో పెట్టారు.
మాజీ ఉపముఖ్యమంత్రి పిసిసి సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా సంగారెడ్డి డీసీసీ పదవి అధిష్టాన వర్గం పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్ష పదవికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి, దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, శనివారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గం జాబితాలో సంగారెడ్డి డీసీసీ పదవిలో ఎవరిని నియమించలేదు.
ఇది మినహా సంగారెడ్డి, పటాన్ చెరువు సంగారెడ్డి , జహీరాబాద్, మెదక్, సిద్దిపేటకు పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కింది. ఏది ఎమైనా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన దివంగత నేత బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి, సంగారెడ్డి నుంచి ఫహీంలకు పదవులు లభించాయి.
మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా పనిచేస్తున్న గాలి అనిల్ కుమార్‌కు పీసీసీ ఉపాధ్యక్ష పదవి లభించింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డికి సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా రెండో సారి అవకాశం లభించింది. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కంటా రెడ్డి తిరుపతి రెడ్డికి సైతం రెండో సారి పదవి లభించింది. వీరు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు.