Medak | సిద్దిపేటలో విషాదం.. ఇద్దరు మైనర్ ప్రేమికుల ఆత్మహత్య

Medak విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మైనర్ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాల్లోకెళ్తే దుబ్బాక మున్సిపల్ పరిధిలో పదో వార్డు లక్షపేట లచ్చ పేట గ్రామంలో భగీరథ (17), నేహా (16) ఇద్దరు పదవ తరగతి వరకు లచ్చపేటలోని మోడల్ స్కూల్లో చదువుకున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న నేహా ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూరపాటి భగీరథ ఇంట్లో […]

Medak | సిద్దిపేటలో విషాదం.. ఇద్దరు మైనర్ ప్రేమికుల ఆత్మహత్య

Medak
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మైనర్ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాల్లోకెళ్తే దుబ్బాక మున్సిపల్ పరిధిలో పదో వార్డు లక్షపేట లచ్చ పేట గ్రామంలో భగీరథ (17), నేహా (16) ఇద్దరు పదవ తరగతి వరకు లచ్చపేటలోని మోడల్ స్కూల్లో చదువుకున్నారు.

ఇదే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న నేహా ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూరపాటి భగీరథ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందారు. మైనార్టీ తీరకముందే ఇరు కుటుంబాలు ప్రేమ వివాహానికి ఒప్పుకోవడం కష్టంగా ఉంటుందని భావించి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నేహా తల్లి స్థానికంగా బట్టల షాప్ లో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడు కురపాటి భ‌గీర‌థ‌ మున్సిపల్ కౌన్సిలర్ బంగారయ్య కు మనుమడు.

ఇరు కుటుంబాల్లో విషాదం

ఇద్దరు మైనర్లు కావడం, కులాలు వేరు కావడం పెద్దలు ప్రేమకు అడ్డు చెపుతారని భావించి హత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల మృతితో తల్లి దండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.