Virupaksha: మెగా, నందమూరి కాంబో.. బీభత్సం
విధాత: ‘‘అజ్ఞానం భయానికి మూలం. భయం, మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం, జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’.. ఈ పవర్ ఫుల్ డైలాగ్‌ని.. పవర్ ఫుల్ వాయిస్‌లో వింటే ఎలా ఉంటుందో తెలియాలంటే.. తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’ ఫస్ట్ గ్లింప్స్ చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా, ఆయన 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా మేకర్స్ […]

విధాత: ‘‘అజ్ఞానం భయానికి మూలం. భయం, మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం, జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’.. ఈ పవర్ ఫుల్ డైలాగ్‌ని.. పవర్ ఫుల్ వాయిస్‌లో వింటే ఎలా ఉంటుందో తెలియాలంటే.. తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’ ఫస్ట్ గ్లింప్స్ చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా, ఆయన 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా మేకర్స్ వదిలారు.
ఈ గ్లింప్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఆయన వాయిస్‌లో పై పవర్ ఫుల్ డైలాగ్.. మరింతగా ఆకర్షిస్తోంది. అన్నింటికంటే కూడా.. మెగా హీరో సినిమాకి నందమూరి హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. ఈ బంధం మరింతగా స్ట్రాంగ్ అవుతోంది.
మెగా, నందమూరి కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎటువంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్‌కి మరోసారి మంచి మెసేజ్ ఇచ్చినట్లయింది. ‘విరూపాక్ష’ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇదొక థ్రిల్లర్ అనేది ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
స్క్రీన్‌పై ఏవేవో సంఘటనలు జరుగుతుంటాయి. వెనుక.. ‘‘అజ్ఞానం భయానికి మూలం. భయం, మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం, జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’’ అంటూ ఎన్టీఆర్ వాయిస్‌లో డైలాగ్ అనంతరం.. ‘విరూపాక్ష’ టైటిల్ రివీల్ చేశారు.
ఆ తర్వాత జరిగే కొన్ని సంఘటనలు, సాయిధరమ్ తేజ్ ఎంట్రీ.. మొత్తంగా.. ‘విరూపాక్ష’ పవర్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కుతుందనేలా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.అందుకే పాన్ ఇండియా సినిమాగా ‘విరూపాక్ష’ విడుదల కాబోతోంది. గ్లింప్స్ చివరిలో 2023 ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటైన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. మెగా, నందమూరి కలయికలో వచ్చిన ఈ గ్లింప్స్.. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.