సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డ్ సభ్యులు
విధాత: నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలోని బృందం పరిశీలించారు. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం,గ్యాలరీలను ,క్రస్ట్ గేట్లను ,కుడి, ఎడమ కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ నది రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లో కొత్తగా వచ్చామని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై పూర్తి అవగాహన కోసం పరిశీలనకు వచ్చామన్నారు. వీరితోపాటు కృష్ణ రివర్ బోర్డ్ అధికారులు అశోక్ […]

విధాత: నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలోని బృందం పరిశీలించారు. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం,గ్యాలరీలను ,క్రస్ట్ గేట్లను ,కుడి, ఎడమ కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ నది రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లో కొత్తగా వచ్చామని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై పూర్తి అవగాహన కోసం పరిశీలనకు వచ్చామన్నారు. వీరితోపాటు కృష్ణ రివర్ బోర్డ్ అధికారులు అశోక్ కుమార్ ,శివ ప్రసాద్, రాఘవేంద్రరావు, సాగర్ డ్యామ్ ఇ ఇ మల్లికార్జునరావు, డిఇ సుదర్శన్ ,శ్రీనివాస్ ,ఏ ఏ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.