Minister KTR | బీజేపీ అంటే బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ( BJP )పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీకి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపీ అంటే బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ( Balatkaar Justification Party ) అని పేర్కొంటూ కేటీఆర్ ఎద్దెవా చేశారు. బిల్కిస్ బానో కేసు దోషులతో( Bilkis Bano convicts ) బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండటం బీజేపీ విధానాలను […]

Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ( BJP )పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీకి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపీ అంటే బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ( Balatkaar Justification Party ) అని పేర్కొంటూ కేటీఆర్ ఎద్దెవా చేశారు. బిల్కిస్ బానో కేసు దోషులతో( Bilkis Bano convicts ) బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండటం బీజేపీ విధానాలను తెలియజేస్తుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
బిల్కిస్ బానో దోషులు విడుదలైనప్పుడు వారిని బీజేపీ నేతలు సత్కరించి సంబురాలు చేసుకున్నారని తెలంగాణ రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడేమో బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి బిల్కిస్ బానో దోషులు వేదికలు పంచుకుంటున్నారని సతీశ్ రెడ్డి ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
జరిగింది ఇదీ..
గుజరాత్( Gujarat )లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకరైన శైలేష్ చిమన్‌లాల్ భట్ ఆ వేదికను పంచుకున్నాడు. ఇదే వేదికపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే చిమన్‌లాల్ భట్ కూర్చొని ఉన్న ఫోటోలను సదరు ఎంపీ, ఎమ్మెల్యే తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను 2022, ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం రెమిషన్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. దోషులను విడుదల చేయడంపై దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
Welcome to #AmritKaal
Balatkaar Justification Party and it’s Brazen embrace of these rapists is a true reflection of their mindset https://t.co/EBdkfkDbzr
— KTR (@KTRBRS) March 27, 2023