టీచర్ల బదిలీలకు పూర్వపు జిల్లానే పరిగణింపు.. 317 జీవోపై మంత్రి సబిత స్పష్టత
విధాత: ప్రభుత్వ టీచర్ల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 317 జీవో కారణంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్వల్ప ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం […]

విధాత: ప్రభుత్వ టీచర్ల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 317 జీవో కారణంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్వల్ప ఊరట లభించింది.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన 59 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.