Minister Savita: బొకే విసిరేసిన మంత్రి సవిత..వీడియో వైరల్!

అమరావతి: ఏపీ మంత్రి సవిత తన దురుసు వ్యవహార శైలితో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సరిత పెనుకొండ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతన్, స్థానిక తహశీల్ధార్ శ్రీధర్ సహా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ మేరకు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహశీల్ధార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత దురుసుగా విసిరేసి ముందుకు కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో మంత్రి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తహశీల్ధార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి..ఆ వరుసలో మిగతా వారు ఇచ్చిన బొకేలను కూడా తీసుకోకుండానే ముందుకు కదిలారు. మంత్రి ప్రవర్తనతో వారంతా అవాక్కయ్యారు. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల 1వ తేదీన అధికారులతో మంత్రి సవిత సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. అయితే మంత్రి బొకే విసిరిన వ్యవహారం కాస్తా వైరల్ గా మారడంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మంత్రి దురుసు ప్రవర్తన.
పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను విసిరేసిన మంత్రి సవిత pic.twitter.com/CmaBQAuaay
— greatandhra (@greatandhranews) June 7, 2025