Karimnagar | మంత్రి కనుసన్నల్లో మైనార్టీ బంధు
Karimnagar | భజన బ్యాచ్ కే మైనార్టీ బంధు అర్హులకు దక్కకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ విధాత బ్యూరో, కరీంనగర్: మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు మంత్రి గంగుల కమలాకర్ కనుసన్నల్లో అనర్హులకు దోచిపెడుతున్నారని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ బంధు, కార్పొరేషన్ లోన్లు పేద ముస్లింలను కాదని, బీఆర్ఎస్ భజన బ్యాచ్ కు […]

Karimnagar |
- భజన బ్యాచ్ కే మైనార్టీ బంధు
- అర్హులకు దక్కకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం
- కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్
విధాత బ్యూరో, కరీంనగర్: మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు మంత్రి గంగుల కమలాకర్ కనుసన్నల్లో అనర్హులకు దోచిపెడుతున్నారని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ బంధు, కార్పొరేషన్ లోన్లు పేద ముస్లింలను కాదని, బీఆర్ఎస్ భజన బ్యాచ్ కు దక్కేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల వేళ కార్పొరేషన్ ద్వారా లక్ష వరకూ లోన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకూ నిబంధనలు వెల్లడించకుండా మోసగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకూ దాదాపు 5000 మంది పై చిలుకు పేదలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్కరు ఆఫిడవిట్, ఆదాయ, కులం సర్టిఫికెట్ జిరాక్స్, ఆన్ లైన్.. ఇలా ఒక్కొక్కరికి దాదాపు రూ. 500 వరకు ఖర్చు అయ్యిందన్నారు.
ఈ డబ్బులే దాదాపు రూ.25 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి లోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేస్తామని, మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లయిఖ్ ఖాద్రి, నిహల్ అహ్మద్, ఖాజా ఖాన్, ఫిరోజ్, హనీఫ్ పాల్గొన్నారు.