రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్య చేసుకుని చావాలి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

  • By: Somu    latest    Sep 23, 2023 12:16 PM IST
రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్య చేసుకుని చావాలి: ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. బెల్లంపల్లి మండలంలోని బట్వానపల్లిలో రైతు వేదిక సమావేశంలో కార్యకర్తలను, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆరెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రతి రైతు ఆకలితో చావవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

ఇదే ఫ్లోలో రైతులు ఆకలితో చావద్దని ఆత్మహత్య చేసుకుని చావాలని నోరు జారిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇప్పటికే అనేక వివాదాలలో సతమతమవుతుంటే దానికి తోడు మళ్లీ రైతులు ఆత్మహత్య చేసుకోని చావాలని నోరు జారిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో రైతులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.