CM KCRతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్ నేతల అసంతృప్తి..!
విధాత: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను కలిసిన జగ్గారెడ్డి.. వివిధ సమస్యలపై కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి కేటీఆర్‌కు కూడా జగ్గారెడ్డి వినతిపత్రం అందించారు. సదాశివపేట వరకు మెట్రో విస్తరించాలని సీఎంను జగ్గారెడ్డి కోరారు. తన నియోజకవర్గంలో 500 మంది దళితులకు దళితబంధు అమలు చేయాలన్నారు. సంగారెడ్డి చెరువులతో పాటు మహబూబ్ సాగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం […]

విధాత: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను కలిసిన జగ్గారెడ్డి.. వివిధ సమస్యలపై కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి కేటీఆర్‌కు కూడా జగ్గారెడ్డి వినతిపత్రం అందించారు.
సదాశివపేట వరకు మెట్రో విస్తరించాలని సీఎంను జగ్గారెడ్డి కోరారు. తన నియోజకవర్గంలో 500 మంది దళితులకు దళితబంధు అమలు చేయాలన్నారు. సంగారెడ్డి చెరువులతో పాటు మహబూబ్ సాగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి..!
సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను జగ్గారెడ్డి కలవడంపై కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీని కలిస్తే తప్పు లేదు కానీ.. తాను కేసీఆర్‌ను కలిస్తే తప్పా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మోదీని కొందరు డైరెక్ట్‌గా కలుస్తున్నారు.
కొందరేమో చాటుగా కలుస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న రెండు రోజులకే తనపై కోవర్టు ముద్ర వేశారని, కొత్తగా వచ్చే బద్నాం ఏముందని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఒక వేళ బీఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే.. సంగారెడ్డి టిక్కెట్‌ను కేసీఆర్ ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారిపోవచ్చన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.