లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు.. రిమాండ్ రిపోర్టు విడుదల
విధాత: ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతన్ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు దాఖలు చేశారు. ఢిల్లీ […]

విధాత: ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతన్ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు దాఖలు చేశారు. ఢిల్లీ స్కాంలో రూ. 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించింది.
ఈ సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రిచారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఈ రూ. 100 కోట్లు విజయ్ నాయర్‌కు చేరాయని తెలిపింది. ఈ విషయాలన్నింటిని అమిత్ ఆరోరా తన వాంగ్మూలంలో ధ్రువీకరించారని ఈడీ పేర్కొంది. కుంభకోణంలో ప్రమేయమున్న వారు ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్ డేటాను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
కల్వకుంట్ల కవితవి 2 నెంబర్లు, 10 ఫోన్లు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లను ధ్వంసం చేసినట్లు చెప్పింది. మొత్తం 36 మంది 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఫోన్లలో కల్వకుంట్ల కవితవి 2 నెంబర్లు, 10 ఫోన్లు ఉన్నట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు. భాగస్వాములు, అనుమానితులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం చేశారు.
17 ఫోన్లను మాత్రం రికవరీ చేసినట్లు కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. ఈ కుంభకోణంలో మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అదికారులు ఉన్నారని స్పష్టం చేశారు. ప్రధాన నిందితుల్లో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు. అయితే అమిత్ ఆరోరాతో కవిత పలుమార్లు ఫక్షన్ మాట్లాడినట్లు అతని కాల్ డేటాలో తేలింది. కవిత ఫోన్ నంబర్.. 6209999999.