Monsoon | కేరళను తాకని రుతుపవనాలు.. ఆలస్యమయ్యే అవకాశం
Monsoon విధాత: నైరుతి రుతుపవనాలు కేరళను ఆదివారం తాకుతాయని భావించినప్పటికీ.. వాటి రాక ఆలస్యమయ్యేలా ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు లక్షద్వీప్ వద్దకు చేరుకున్నా .. అక్కడి నుంచి కేరళ రావడానికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. రుతుపవనాలు త్వరగా రావాలంటే మేఘాల విస్తృతి, పశ్చిమ పవనాలు బలం పుంజుకోవడం, కేరళలోని నిర్దిష్ట 14 ప్రాంతాల్లో రెండు రోజుల పాటు చిరు జల్లులు కురవడం వంటి సానుకూలతలు ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఏడాది […]

Monsoon
విధాత: నైరుతి రుతుపవనాలు కేరళను ఆదివారం తాకుతాయని భావించినప్పటికీ.. వాటి రాక ఆలస్యమయ్యేలా ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు లక్షద్వీప్ వద్దకు చేరుకున్నా .. అక్కడి నుంచి కేరళ రావడానికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు.
రుతుపవనాలు త్వరగా రావాలంటే మేఘాల విస్తృతి, పశ్చిమ పవనాలు బలం పుంజుకోవడం, కేరళలోని నిర్దిష్ట 14 ప్రాంతాల్లో రెండు రోజుల పాటు చిరు జల్లులు కురవడం వంటి సానుకూలతలు ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. మరో రెండు రోజుల పాటు పరిస్థితిని గమనిస్తే గానీ రుతుపవనాల రాకను అంచనా వేయలేమని వాతావరణ శాఖ తెలిపింది.