ప్రపంచంలో మరుగుదోడ్లు ఉన్న ఇళ్ల కంటే.. మొబైల్స్ సంఖ్యే ఎక్కువ
విధాత: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆధునిక జీవనశైలి మారిపోయింది. ముఖ్యంగా మొబైల్ మనిషి చేతిలోకి వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచ జనాభా 700 కోట్లు ఉంటే సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య 730 కోట్ల వరకు ఉంటుందని 2021లోనే ఓ అధ్యయనం వెల్లడించింది. ఇక మన దేశంలో అయితే మొబైల్ వినియోగదారులు ఏటా గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లపైనే ఉన్నది. వీరిలో 120 కోట్ల మందికి […]

విధాత: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆధునిక జీవనశైలి మారిపోయింది. ముఖ్యంగా మొబైల్ మనిషి చేతిలోకి వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచ జనాభా 700 కోట్లు ఉంటే సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య 730 కోట్ల వరకు ఉంటుందని 2021లోనే ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇక మన దేశంలో అయితే మొబైల్ వినియోగదారులు ఏటా గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లపైనే ఉన్నది. వీరిలో 120 కోట్ల మందికి పైగా మొబైల్ వినియోగిస్తున్నారని ఓ నివేదిక చెబుతున్నది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మనిషి మొబైల్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
అయితే ఇదే కాలంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక విస్తుపోయే విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలో టాయిలెట్ సౌకర్యం ఉన్న ఇళ్ల కంటే ప్రజల దగ్గర ఉన్న మొబైల్ సంఖ్యే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 350 కోట్ల మందికి సరైన టాయిలెట్లు అందుబాటులో లేవని పేర్కొన్నది. దీనివల్ల మానవ వ్యర్థాలు నదులు, చెరువుల్లో కలుస్తూ నీటి వనరులు కలుషితమవుతున్నాయని తెలిపింది.