వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ ప్రధాన అనుచరుడు ఉదయ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచిన సీబీఐ అధికారులు విధాత: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్‌ వికానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం జ‌డ్జి ముందు హాజరు పరిచారు. గూగూల్‌ టెక్కవుట్‌ ద్వారా ఉదయ్‌ పులివెందులలోని ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారుల బృందం అక్కడకు వెళ్లి అరెస్ట్‌ చేసింది. ఆతరువాత ఉదయ్‌ను పులివెందుల నుంచి కడప […]

వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ ప్రధాన అనుచరుడు ఉదయ్‌ అరెస్ట్‌
  • హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచిన సీబీఐ అధికారులు

విధాత: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్‌ వికానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం జ‌డ్జి ముందు హాజరు పరిచారు.

గూగూల్‌ టెక్కవుట్‌ ద్వారా ఉదయ్‌ పులివెందులలోని ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారుల బృందం అక్కడకు వెళ్లి అరెస్ట్‌ చేసింది. ఆతరువాత ఉదయ్‌ను పులివెందుల నుంచి కడప జైలు అతిధి గృహానికి తీసుకువెళ్లి విచారించింది. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జ‌డ్జి ముందు హాజరు పరిచింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటికే పలు సార్లు ఉదయ్‌ను విచారించింది. ఉదయ్‌ ఎంపీ అవినాష్‌రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఉదయ్‌ యుసీఐఎల్‌లో పని చేస్తున్నారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో పాటు ఉదయ్‌ కూడ ఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఆ రోజున అంబులెన్స్‌, ఫ్రీజర్‌, వైద్యులను రప్పిండంలో ఉదయ్‌ కీలకపాత్ర పోషించినట్లుగా సీబీఐ అధికారులు సందేహిస్తున్నారు.