ములాయం సింగ్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
విధాత: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్(82) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ములాయం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్.. లక్నో నుంచి హుటాహుటిన ఢిల్లీకి […]

విధాత: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్(82) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ములాయం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్.. లక్నో నుంచి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ములాయం మొదటి భార్య మాల్తి దేవి 2003లో మరణించగా రెండో భార్య సాద్నా గుప్తా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌లో మరణించింది. యూపీలోని మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ములాయం మొదటి భార్య మాల్తి దేవి కుమారుడు అఖిలేష్ యాదవ్.