విషమంగానే ములాయం ఆరోగ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
విధాత : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని మేదాంత ఆస్పత్రి వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ములాయంకు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. వివిధ రకాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ములాయంకు చికిత్స అందిస్తున్నట్లు మేదాంత ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తో చికిత్స కొనసాగుతోందన్నారు. గత వారం ములాయం తీవ్ర అనారోగ్యానికి గురి […]

విధాత : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని మేదాంత ఆస్పత్రి వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ములాయంకు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. వివిధ రకాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ములాయంకు చికిత్స అందిస్తున్నట్లు మేదాంత ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తో చికిత్స కొనసాగుతోందన్నారు.
గత వారం ములాయం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. 1939, నవంబర్ 22న ములాయం సింగ్ జన్మించారు. ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి సేవలందించారు. గతంలో కేంద్ర రక్షణ మంత్రిగా కూడా ములాయం పని చేశారు.