ప్రియుడితో కలిసి భర్తను స్మార్ట్‌గా చంపేసిన భార్య..
Mumbai | ప్రియుడి మోజులో పడ్డ మహిళలు.. తమ భర్తలను కిరాతకంగా చంపిన ఘటనలను ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ భార్య మాత్రం తన భర్తను చాలా స్మార్ట్‌గా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా అతి తెలివిని ప్రదర్శించింది. కానీ అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర ముంబైకి చెందిన కమల్ కాంత్, కవితకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వారికి పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో.. రెండు, మూడేండ్ల నుంచి […]

Mumbai | ప్రియుడి మోజులో పడ్డ మహిళలు.. తమ భర్తలను కిరాతకంగా చంపిన ఘటనలను ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ భార్య మాత్రం తన భర్తను చాలా స్మార్ట్‌గా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా అతి తెలివిని ప్రదర్శించింది. కానీ అడ్డంగా బుక్కైంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర ముంబైకి చెందిన కమల్ కాంత్, కవితకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వారికి పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో.. రెండు, మూడేండ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది కవిత. ఈ క్రమంలో కమల్ కాంత్ చిన్ననాటి స్నేహితుడైన హితేష్ జైన్‌తో కవితకు పరిచయం ఏర్పడింది. ఇక అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అయితే పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ నీ దగ్గరకు వస్తానని కమల్ కాంత్‌కు కవిత చెప్పింది. ఆయన కూడా అంగీకరించాడు. దీంతో కవిత కమల్ కాంత్ వద్దకు వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాంత్ తల్లి తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోయింది.
తల్లి చనిపోయిన కొద్ది రోజులకు కమల్ కాంత్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కాంత్ ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. అతని రక్తంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మానవుడి రక్తంలో ఆర్సెనిక్ ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. అతను కడుపు నొప్పితో బాధ పడుతూ నవంబర్ 19న చనిపోయాడు.
పోలీసులకు అనుమానం రావడంతో..
కమల్ కాంత్ మృతిపై ముంబై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు. కమల్ కాంత్ వైద్యం తీసుకున్న ఆస్పత్రి రిపోర్టుల ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. కాంత్‌పై విష ప్రయోగం జరిగిందని డాక్టర్లు, పోలీసులు నిర్ధారించారు. దీంతో కవిత, హితేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
కాంత్‌ను చంపేందుకు కొద్ది నెలల నుంచి ఆహారంలో రసాయనాలు కలిపి ఇస్తున్నట్లు అంగీకరించింది కవిత. ఆ రసాయనాలు కాంత్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో చనిపోయాడు. కాంత్ తల్లి కూడా కడుపు నొప్పితోనే చనిపోయింది. అయితే ఆమెపై కూడా విష ప్రయోగం జరిగిందా? అనే ప్రశ్న తలెత్తుంది. ఆ కేసును కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.