హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై వెంటాడి, వేట కొడవళ్లతో నరికేశారు (Video)
Hyderabad,Murder ఓ యువకుడిని పట్టపగలే నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికి చంపారు. ఆ యువకుడిని వేట కొడవళ్లతో కసితీరా నరికారు. ఊపిరి పోయిందని నిర్ధారించుకున్న తర్వాత అటునుంచి దుండగులు వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జియగూడలోని బైపాస్ దారిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పురానపూల్ నుంచి లంగర్ హౌస్ వెళ్లే బైపాస్ రోడ్డులో ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడిని వెనుక నుంచి మరో ముగ్గురు యువకులు తరుముతూ వెళ్లారు. ఇక ఆ యువకుడిని […]

Hyderabad,Murder
ఓ యువకుడిని పట్టపగలే నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికి చంపారు. ఆ యువకుడిని వేట కొడవళ్లతో కసితీరా నరికారు. ఊపిరి పోయిందని నిర్ధారించుకున్న తర్వాత అటునుంచి దుండగులు వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జియగూడలోని బైపాస్ దారిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పురానపూల్ నుంచి లంగర్ హౌస్ వెళ్లే బైపాస్ రోడ్డులో ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడిని వెనుక నుంచి మరో ముగ్గురు యువకులు తరుముతూ వెళ్లారు. ఇక ఆ యువకుడిని ఆ ముగ్గురు దుండగులు పట్టుకుని నేలపై పడేశారు. ఒకరు ఇనుపరాడ్డుతో తలపై పలుమార్లు కొట్టాడు.
మరో యువకుడేమో.. వేట కొడవలితో గొంతు, మెడపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఊపిరి ఆగిందని నిర్ధారించుకున్న తర్వాత దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. అయితే ఆ ముగ్గురు కూడా మూసీలోకి దూకి అటు నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇసామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(32)గా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపురా సీఐ అశోక్ కుమార్ తెలిపారు. దర్యాప్తులో వీడియో కీలకం కానుంది.