Supreme Court | సీసీఏ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్..!
సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

Supreme Court | సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. పౌరసత్వ చట్టం కింద కొన్ని మతాలకు చెందిన వారికే పౌరసత్వం ఇస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు. సీఏఏ చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏను సవాల్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. సీఏఏకి వ్యతిరేకంగా ఐయూఎంఎల్ తన రిట్ పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేసింది. చట్టం ఏకపక్షంగా ఉందని.. రాజ్యాంగం పరంగా వర్తించదని పేర్కొంది. సీఏఏ చట్టం ప్రకారం.. పొరుగుదేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నట్లు కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. చట్టం ప్రకారం.. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారత్‌కు వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన, క్రైస్తవులకు పౌరసత్వం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, పౌరసత్వం సవరణ చట్టాన్ని ముస్లిం వర్గాలకు చెందిన కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం తమపై వివక్ష చూపుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.