నకిరేకల్ కాంగ్రెస్ కమిటీలు చెల్లవు: TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
విధాత: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించిన మండల కాంగ్రెస్ కమిటీలు చెల్లవని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కమిటీల ఏర్పాటులో తన ప్రతిపాదనలను డిసిసి అధ్యక్షులు స్థానిక ముఖ్య నాయకులతో చర్చించి ఇన్చార్జిలకు ఏప్రిల్ 20వ తేదీ లోగా పంపించాలని, అనంతరం వాటిని పరిశీలించి పిసిసి ఫైనలైజ్ చేస్తుందన్నారు. పిసిసి నిర్దేశించిన ఈ సూచనలకు భిన్నంగా డిసీసీ అధ్యక్షులు ఏకపక్షంగా మండల కమిటీలను నియమించిన […]

విధాత: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించిన మండల కాంగ్రెస్ కమిటీలు చెల్లవని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
కమిటీల ఏర్పాటులో తన ప్రతిపాదనలను డిసిసి అధ్యక్షులు స్థానిక ముఖ్య నాయకులతో చర్చించి ఇన్చార్జిలకు ఏప్రిల్ 20వ తేదీ లోగా పంపించాలని, అనంతరం వాటిని పరిశీలించి పిసిసి ఫైనలైజ్ చేస్తుందన్నారు.
పిసిసి నిర్దేశించిన ఈ సూచనలకు భిన్నంగా డిసీసీ అధ్యక్షులు ఏకపక్షంగా మండల కమిటీలను నియమించిన పక్షంలో అవి చెల్లబోవని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
అందులో భాగంగానే నకిరేకల్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షుడు ప్రకటించిన మండల కాంగ్రెస్ కమిటీలు చెల్లవని స్పష్టం చేశారు.