మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు
విధాత: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి తిరిగి గులాబీ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ నల్లాల ఓదెలు దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ లీడర్ల మధ్య నెలకొన్న అసమ్మతి కారణంగా పార్టీని వీడిన ఓదెలు దంపతులు అనంతరం రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం తిరిగి […]

విధాత: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి తిరిగి గులాబీ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ నల్లాల ఓదెలు దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ లీడర్ల మధ్య నెలకొన్న అసమ్మతి కారణంగా పార్టీని వీడిన ఓదెలు దంపతులు అనంతరం రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం తిరిగి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

