రేపటి నుంచి లోకేశ్ పాదయాత్ర.. పోలీసుల అనుమతి

ముందస్తు బెయిల్ కోసం పిటిషన్
నిరసన శిబిరాల్లో అత్తాకోడళ్లు
విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో పొదలవాడలో ఆగిపోయిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి రేపటి నుంచి ప్రారంభించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో చంద్రబాబు అరెస్టు..సీఎం జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాల్లో ప్రజల్లో ఎండగట్టే లక్ష్యంతో లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగనుంది.
ఇందుకు కోసం టీడీపీ యాక్షన్ కమిటీ పాదయాత్ర ప్రణాళికను రూట్ మ్యాప్‌ను ఖరారు చేసింది. పాదయాత్రలో తనను అరెస్టు చేయవచ్చన్న ప్రచారంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసుల ఏ 14గా ఉన్న లోకేశ్ బుధవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. వరుస కేసుల్లో చంద్రబాబును, లోకేశ్‌లను ఇరికించి జగన్ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తుంది.
అటు చంద్రబాబు అరెస్టును నిరసిస్తు టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్న నిరసన దీక్షలకు అత్తా కోడళ్లు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు హాజరవుతూ క్రియాశీలక రాజకీయాల్లో సందడి చేస్తున్నారు. బుధవారం తూర్పు గోదావారి జిల్లా సీతానగరంలో రిలే నిరాహార దీక్ష శిబరాలను సందర్శించిన నారా భువనేశ్వరి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అవినీతి లేదని, అధారాలు లేకుండా అక్రమంగా రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేసి, బెయిల్ రాకుండా అడ్డుపడుతు జైల్లో మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో సింపతీని రాజేసే ప్రయత్నం చేస్తు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతున్నారు.