నర్సాపూర్: టార్గెట్‌ మురళీ యాదవ్‌! కుర్చీ దించుడే లక్ష్యంగా BRS స్కెచ్

మురళి యాదవ్‌కు ఉచ్చు బిగుస్తున్న అధికార పార్టీ క్యాంప్ రాజకీయాలు.. షురూ! పావులు కదుపుతున్న మంత్రి హరీశ్‌రావు మద్దతు కూడగడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి విధాత, మెదక్ బ్యూరో: బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ రావు పై విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్ర గొల్ల మురళి యాదవ్ చైర్మన్ కుర్చీని దించేందుకు మంత్రి […]

నర్సాపూర్: టార్గెట్‌ మురళీ యాదవ్‌! కుర్చీ దించుడే లక్ష్యంగా BRS స్కెచ్
  • మురళి యాదవ్‌కు ఉచ్చు బిగుస్తున్న అధికార పార్టీ
  • క్యాంప్ రాజకీయాలు.. షురూ!
  • పావులు కదుపుతున్న మంత్రి హరీశ్‌రావు
  • మద్దతు కూడగడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ రావు పై విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్
ఎర్ర గొల్ల మురళి యాదవ్ చైర్మన్ కుర్చీని దించేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డిలు పక్కా స్కెచ్ వేశారు. ఏలాగైనా మురళి యాదవ్‌ను చైర్మన్ పీఠంపై నుంచి దించాలని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయించిందని సమాచారం.

అందులో భాగంగానే వైస్ చైర్మన్ నహీం మొద్దిన్ అధ్వర్యంలో 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్ రాజర్షి షాకు అవిశ్వాసం నోటీసును ఇచ్చిన విషయం విధితమే. అయితే మొత్తం 15 మంది కౌన్సిలర్లకు గాను 8 మంది అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండడంతో అవిశ్వాసానికి రంగం సిద్దం చేశారు. చైర్మన్ మురళి యాదవ్ వైపు ఆయనతో కలిసి 7 గురు కౌన్సిలర్లు ఉన్నారు.

అయితే మురళీయాదవ్‌ను అధికార పార్టీ నాయకులు అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. అంతే కాకుండా ఆర్థిక ములాలపై దెబ్బ కొడుతున్నారు. చైర్మన్‌ను కుర్చి నుంచి దింపేందుకు పథక రచన చేశారు. చైర్మన్ మురళి యాదవ్ ఆధీనంలో ఉన్న దాదాపు 15 నుంచి రూ.20 కోట్ల విలువైన 12 గుంటల భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డ్ పాతారు. అలాగే మురళి యాదవ్ నిర్వహణలో ఉన్న ఆర్టీసీ పెట్రోల్ బంక్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

క్యాంప్ రాజకీయాలు.. షురూ!

అవిశ్వాసం నోటీసు ఇచ్చిన అధికార పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాలతో క్యాంప్‌కు వెళ్ళినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక్కరిద్దరు కౌన్సిలర్లు చేజారితే అసలుకే మోసం వస్తదని ముందే పసిగట్టిన అధికార పార్టీ అధిష్టాన వర్గం వీరందరినీ ఒకే చోట ఉంచినట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ నహీమొద్దిన్, అశోక్ గౌడ్, నశ్రత్ సిద్ధికి, గొల్ల రుక్కమ్మా, పంబాలా లలితా బిక్షపతి, సంగిడిపల్లి సునీతా ఆంజనేయులు గౌడ్, చలిమేటి లక్ష్మీ గౌడ్, పంబాల రాజేందర్‌లు ఉన్న విషయం తెలిసిందే.

మురళీయాదవ్ వెంట లతా రమేష్ యాదవ్, ఎరుకల యాదగిరి, వనముల బుచ్చేశ్ యాదవ్, సంగని సురేష్, గోడ రాజేందర్ యాదవ్, ఒంటెద్దు సునితా బాల్ రెడ్డిలు మురళి యాదవ్ శిబిరంలో ఉన్నారు.

ఆవిశ్వాసం పెట్టి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓటుతో చైర్మన్ సీట్‌ను దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీ వేస్తున్న ఏత్తులకు.. చిత్తవుతారో మురళి యాదవ్.. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లను ప్రసన్నం చేసుకుంటారో.. ఎవరు నెగ్గుతారో వేసి చూడాల్సిందే.