Anushka | అనుష్క హ‌గ్ గురించి.. ఆస‌క్తిక‌ర కామెంట్ చేసిన జాతిర‌త్నం

Anushka | జాతిర‌త్నాలు సినిమాతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన హీరో నవీన్ పోలిశెట్టి. గ‌తంలో ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ జాతిరత్నాలు సినిమా బ్రేక్ ఇచ్చింది.ఈ సినిమా అందించిన బ్రేక్‌తో న‌వీన్ పోలిశెట్టికి ఏకంగా అనుష్క వంటి స్టార్ హీరోయిన్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.. డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ […]

  • By: sn    latest    Aug 26, 2023 2:37 AM IST
Anushka | అనుష్క హ‌గ్ గురించి.. ఆస‌క్తిక‌ర కామెంట్ చేసిన జాతిర‌త్నం

Anushka |

జాతిర‌త్నాలు సినిమాతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన హీరో నవీన్ పోలిశెట్టి. గ‌తంలో ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ జాతిరత్నాలు సినిమా బ్రేక్ ఇచ్చింది.ఈ సినిమా అందించిన బ్రేక్‌తో న‌వీన్ పోలిశెట్టికి ఏకంగా అనుష్క వంటి స్టార్ హీరోయిన్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.. డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ స్పీడ్ పెంచారు. ఇంటర్వ్యూలు, తదితర కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు హీరో న‌వీన్ పోలిశెట్టి. అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ హీరోయిన్ అయిన అనుష్క పక్కన నటించడం అంత సులువు కాద‌ని అర్ధ‌మైంది.

షూటింగ్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు నేను చాలా ఇబ్బంది ప‌డ్డాను. అయితే అనుష్క ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఫ్రీగా క‌లిసి నటించానని చెప్పుకొచ్చాడు. ఆమెతో షూటింగ్ మొత్తం చాలా స‌ర‌దాగా సాగింది. అంతేకాక ఈ సినిమా వ‌ల‌న అనుష్క‌తో మంచి స్నేహం కూడా ఏర్ప‌డింద‌ని పేర్కొంది.

సినిమాలో అనుష్క‌తో కెమిస్ట్రీ చాలా బాగా వ‌చ్చింది. అనుష్క సెట్స్ లో ప్ర‌తి ఒక్కరితో చాలా స‌ర‌దాగా, ఫ్రెండ్లీగా ఉంటుంది.ఆమె సెట్స్ లోకి రాగానే టెక్నీషియ‌న్స్‌కి, తొటీ న‌టీన‌టుల‌కి అభిమాన‌పూర్వ‌కంగా హ‌గ్ ఇస్తుంది. అది చాలా పాజిటివ్ వైబ్స్‌ని ఇస్తుంది అని న‌వీన్ పేర్కొన్నాడు. అనుష్కని చూసి నేను కూడా అభిమానపూర్వ‌కంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలియ‌జేశాడు.

ఆమెలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొక్క‌టి అంటూ న‌వీన్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం అందించ‌గా, ఇటీవ‌ల విడుద‌లైన కొన్ని పాట‌లు శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రించాయి. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.