వరంగల్‌లో.. నేపాల్ మేయర్ల బృందం పర్యటన

వరంగల్ నగరంలో క్షేత్ర స్థాయి పరిశీలన విధాత, వరంగల్: వరంగల్ మహా నగరంలో అవలంబిస్తున్న అత్యాధునిక పారిశుధ్య విధానాల అధ్యయనానికి (స్టడీ టూర్) నేపాల్ మేయర్ల బృందం మంగళవారం బల్దియా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్కీ ప్రతినిధి రాజ్ మోహన్ నగరంలో కొనసాగుతున్న సానిటేషన్ విధానాలను వారికి వివరించారు. నేపాల్ మేయర్ల బృందం అమ్మవారిపేటలో గల ఎఫ్.ఎస్.టి.పితో పాటు, హన్మకొండలోని అంబేద్కర్ నగర్లో గల డిసెంట్రలైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ […]

వరంగల్‌లో.. నేపాల్ మేయర్ల బృందం పర్యటన
  • వరంగల్ నగరంలో క్షేత్ర స్థాయి పరిశీలన

విధాత, వరంగల్: వరంగల్ మహా నగరంలో అవలంబిస్తున్న అత్యాధునిక పారిశుధ్య విధానాల అధ్యయనానికి (స్టడీ టూర్) నేపాల్ మేయర్ల బృందం మంగళవారం బల్దియా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్కీ ప్రతినిధి రాజ్ మోహన్ నగరంలో కొనసాగుతున్న సానిటేషన్ విధానాలను వారికి వివరించారు.

నేపాల్ మేయర్ల బృందం అమ్మవారిపేటలో గల ఎఫ్.ఎస్.టి.పితో పాటు, హన్మకొండలోని అంబేద్కర్ నగర్లో గల డిసెంట్రలైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను, ఇటీవల హన్మకొండలోని 53వ డివిజన్‌లో గల ఆదర్శ కాలనీ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సెప్టిక్ టాంక్ క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు.

వరంగల్ పరిధిలో గల ఎమ్‌హెచ్ నగర్‌లోని స్లం ప్రాంతంలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్లు, చిట్టి పార్క్ ను పరిశీలించి స్థానికులతో మాట్లాడి వారి జీవన స్థితిగతులను,రాజకీయంగా అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. తద్వారా వడ్డేపల్లి వద్ద పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించి నిర్వహణ విధానాన్ని ఆస్కి ప్రతినిధిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మేయర్‌లు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణతో పాటు నగర పరిశుభ్రతలో ప్రజా భాగస్వామ్యం స్పష్టంగా ఉందని, ఇక్కడ అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నగరాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. న‌గ‌ర ప‌రిశీల‌న‌లో నేపాల్ దేశ పలు నగరాల మేయర్లు, మునిసిపల్ ఛైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ సురేష్ జోషి, అస్కి సిబ్బంది అవినాష్ తదితరులు పాల్గొన్నారు.