ఈ పొదుపు పథకం గురించి తెలుసా?..
విధాత: ఇటీవలి బడ్జెట్‌లో మహిళల కోసం ఓ సరికొత్త పొదుపు పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ నెల 1న ప్రకటించిన ఈ పద్దులో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్‌సీ)ను అందుబాటులోకి తెచ్చారు. ఇదో ఏక కాల వ్యక్తిగత చిన్న మొత్తాల పొదుపు పథకం. ఆడపిల్లలు, యువతులు, మహిళలు ఎవరైనా ఈ సర్టిఫికెట్‌ను తీసుకోవచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.2 లక్షలు. ఈ […]

విధాత: ఇటీవలి బడ్జెట్‌లో మహిళల కోసం ఓ సరికొత్త పొదుపు పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ నెల 1న ప్రకటించిన ఈ పద్దులో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్‌సీ)ను అందుబాటులోకి తెచ్చారు. ఇదో ఏక కాల వ్యక్తిగత చిన్న మొత్తాల పొదుపు పథకం.
ఆడపిల్లలు, యువతులు, మహిళలు ఎవరైనా ఈ సర్టిఫికెట్‌ను తీసుకోవచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.2 లక్షలు. ఈ పథకం కింద మదుపరులు 7.5 శాతం నిర్ధిష్ట వడ్డీరేటును అందుకోవచ్చు. ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీంల తరహాలో మూడు నెలలకోసారి వడ్డీరేట్లు మారవు. సర్టిఫికెట్ కాలపరిమితైన రెండేండ్లూ ఒకే వడ్డీరేటు ఉంటుంది.
వడ్డీరేటు ఆకర్షణీయమే
ప్రస్తుత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎంఎస్ఎస్‌సీ కంటే ఎక్కువ వడ్డీరేటును అందిస్తున్నవి సుకన్య సమృద్ధి యోజన (7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (8 శాతం) మాత్రమే. ఇక రెండేండ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేటు 6.8 శాతంగానే ఉన్నది.