ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

విధాత: తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఫొటో చూసిన ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఈ మధ్య ఆమెపై పెళ్లి వార్తలు వినిపించాయి కానీ.. పెళ్లి చేసుకున్నట్లుగా అయితే ఎక్కడా ధృవీకరణ జరగలేదు. సడెన్‌గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కిట్‌ను పోస్ట్ చేసి అందులో పాజిటివ్ వచ్చినట్లుగా చూపిస్తుండటంతో.. ఇదేంటి? ఆమె పెళ్లి కాకుండా తల్లికాబోతోందా? లేదంటే సీక్రెట్ మ్యారేజ్ కానిచ్చేసిందా? అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఈ మధ్య […]

  • By: krs    latest    Oct 28, 2022 5:32 PM IST
ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

విధాత: తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఫొటో చూసిన ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఈ మధ్య ఆమెపై పెళ్లి వార్తలు వినిపించాయి కానీ.. పెళ్లి చేసుకున్నట్లుగా అయితే ఎక్కడా ధృవీకరణ జరగలేదు.

సడెన్‌గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కిట్‌ను పోస్ట్ చేసి అందులో పాజిటివ్ వచ్చినట్లుగా చూపిస్తుండటంతో.. ఇదేంటి? ఆమె పెళ్లి కాకుండా తల్లికాబోతోందా? లేదంటే సీక్రెట్ మ్యారేజ్ కానిచ్చేసిందా? అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఈ మధ్య నయనతార విషయంలో ఫేమస్ అయిన సరొగసి విధానానికి ఏమైనా అంగీకరించిందా? అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

అసలు పెళ్లి కాకుండా.. ఇలా ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టడం చూస్తుంటే.. ఇదేదో ఇంటర్నెట్ అటెన్షన్ కోసం పెట్టినట్లుగా మరికొందరు అనుమానిస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం.. ఆమె ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌తో సోషల్ మీడియా అంతా షేకవుతోంది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

ఇక ఈ పోస్ట్, దానికి వస్తున్న కామెంట్స్ చూసిన వారంతా.. అసలు విషయం ఏమై ఉంటుందా అని సెర్చ్ చేయగా.. సేమ్ టు సేమ్ ఇలాంటి కిట్టే.. మరో హీరోయిన్ పార్వతి తిరువోతు కూడా షేర్ చేయడంతో.. ఇదేదో సినిమాకు సంబంధించిన వ్యవహారం అని అంతా ఫిక్సయ్యారు.

ఇదే విషయం తెలుసుకుని నిత్యామీనన్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే రేపు నిత్యామీనన్ అభిమానులు అని చెప్పుకోవడానికి కూడా సందేహించే పరిస్థితి ఏర్పడింది. ఇక విషయంలోకి వస్తే.. మలయాళంలో ‘వండర్ ఉమెన్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో నిత్యామీనన్ గర్భవతి పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.