Nizamabad | నిద్రిస్తున్న వ్యక్తిపై బండరాయితో కొట్టి దారుణ హత్య..

Nizamabad | విధాత:ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన న్యాల్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన కట్ట రమేష్ (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజులాగే ఇంటి శనివారం మేడపైన నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు కట్ట రమేష్ తలపై బండరాయితో కొట్టి దారుణంగా […]

  • By: krs    latest    Jun 04, 2023 10:45 AM IST
Nizamabad | నిద్రిస్తున్న వ్యక్తిపై బండరాయితో కొట్టి దారుణ హత్య..

Nizamabad |

విధాత:ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన న్యాల్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.

మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన కట్ట రమేష్ (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజులాగే ఇంటి శనివారం మేడపైన నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు కట్ట రమేష్ తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు.

ఉదయం చూసిన గ్రామస్తులు మోపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సౌత్ సిఐ సురేందర్ రెడ్డి, మోపాల్ ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే శనివారం కట్ట రమేష్ అతని భార్యకు మధ్య గొడవ జరిగింది.

అనంతరం ఆదివారం ఉదయం హత్యకు గురి కావడంతో, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవే హత్యకు కారణమా, లేక ఇంకా ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నాడు.