Nizamabad | వర్షంలోనూ.. ఉత్సాహంగా 5Kకే రన్

Nizamabad | విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఓటింగ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 'ఐ ఓట్ ఫర్ షూర్' నినాదంతో శనివారం జిల్లాలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు రన్ లో పాల్గొని, ప్రజాస్వామ్య పరిణతి చాటారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ,బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల పరిధిలో […]

  • By: krs    latest    Aug 19, 2023 12:51 AM IST
Nizamabad | వర్షంలోనూ.. ఉత్సాహంగా 5Kకే రన్

Nizamabad |

విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఓటింగ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ నినాదంతో శనివారం జిల్లాలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు రన్ లో పాల్గొని, ప్రజాస్వామ్య పరిణతి చాటారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ,బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల పరిధిలో 5కె రన్ జరిపారు.

ప్రతీ చోట వర్షపు అడ్డంకిని అధిగమిస్తూ, వివిధ శాఖల అధికారులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏ.ఎన్ ఎంలు, ఆరోగ్య సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున
5కె రన్ లో భాగస్వాములయ్యారు.

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 5కె రన్ విజయవంతానికి ముందస్తుగానే విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. నియోజకవర్గాల వారీగా ఎన్నికల విభాగం అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి 5కె రన్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో అధికారులు అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ 5కె రన్ విజయవంతం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.