MEDAK: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
మురళి యాదవ్‌పై అవిశ్వాసానికి కలెక్టర్‌కు నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్‌లు 8 మంది అవిశ్వాసానికి మద్దతు 7 గురు కౌన్సిలర్ లు చైర్మన్ వెంట. విధాత, మెదక్ బ్యూరో: అనుకున్నట్లే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఏకమై బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చేందుకు మెదక్ కలెక్టరేట్ కు తరలివచ్చి కలెక్టర్ రాజర్షి షా కు అందించారు.వివరాలు ఇలా వున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు, ఉమ్మడి జిల్లా […]

- మురళి యాదవ్‌పై అవిశ్వాసానికి కలెక్టర్‌కు నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్‌లు
- 8 మంది అవిశ్వాసానికి మద్దతు
- 7 గురు కౌన్సిలర్ లు చైర్మన్ వెంట.
విధాత, మెదక్ బ్యూరో: అనుకున్నట్లే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఏకమై బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చేందుకు మెదక్ కలెక్టరేట్ కు తరలివచ్చి కలెక్టర్ రాజర్షి షా కు అందించారు.వివరాలు ఇలా వున్నాయి.
ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎంను విమర్శించారు.
సీఎం ను విమర్శించిన 24 గంటల్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి మురళి యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నడని అందుకే మురళి యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నామని పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు.
మురళీ యాదవ్ సతీమణి రాజమణి మురళీ యాదవ్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల బీజేపీ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, ఈటల రాజేందర్‌ల అధ్వర్యంలో మురళీ యాదవ్ బీజేపీలో చేరారు. అప్పటి నుండి మురళి యాదవ్‌ను చైర్మన్‌గా దించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి లు పార్టీ కౌన్సిలర్ తో మాట్లాడి ఏకతాటిపై ఉంచారు. మంత్రి హరీష్ రావు దృష్టికి సహితం తీసుకెళ్ళి చర్చించారు.
పథకం రచించి అమలు చేస్తున్నారు. ముందు నుంచే హూహించి నట్లే 8 మంది అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వైస్ చైర్మన్ నహీముద్దీన్ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ కు చేరుకొని సోమవారం జిల్లా కలెక్టర్ రజార్షా షా కు వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్.. మున్సిపల్ వైస్ చైర్మన్ నహీమొద్దిన్ అధ్వర్యంలో అశోక్ గౌడ్,సిద్దీకి ,గొల్ల రుక్కమ్మ, పంబాల లలితా బిక్షపతి, లక్ష నగేష్,సునితా ఆంజనేయులు గౌడ్, పంభాల రాజేందర్,లు ఉన్నారు.
మురళి యాదవ్ వెంట 7 గురు
మురళి యాదవ్ వెంట 7 గురు కౌన్సిలర్లు ఉన్నారు. మురళి యాదవ్, లతా రమేష్ యాదవ్,ఎరుకల యాదగిరి, వనముల బుచ్చేష్ యాదవ్,సంగాని సురేష్, గోడా రాజేందర్ యాదవ్, ఒంటెద్దు సునితా రెడ్డి,లు ఉన్నారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండడంతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి నుండి మురళి యాదవులను దించడం ఖాయంగా కనిపిస్తోంది. లేదా ఇద్దరు కౌన్సిలర్లు మురళి యాదవ్ దిక్కు వెళితే ఆయనే చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉంది.