సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదు: RS ప్రవీణ్ కుమార్‌

సిద్దిపేట ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు దొరల పాలన సిద్దిపేట నుంచి అంతం చేస్తం సీఎం జిల్లా హరీశ్‌రావు నియోజకవర్గం నుంచి బీఎస్పిలో చేరికలు విధాత, హైదరాబాద్: సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదని రాజ్యాంగ విరుద్దమైన పాలన కొనసాగుతుందని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గుండాయిజం, బెదిరింపులు, నిరంతర పోలీసుల నిఘాలో సిద్దిపేట ప్రజలు భయంభయంగా బతుకుతున్నారన్నారు. ఇదే సిద్దిపేట జిల్లా నుంచి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికై, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత […]

  • By: krs    latest    Sep 19, 2022 4:42 PM IST
సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదు: RS ప్రవీణ్ కుమార్‌
  • సిద్దిపేట ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు
  • దొరల పాలన సిద్దిపేట నుంచి అంతం చేస్తం
  • సీఎం జిల్లా హరీశ్‌రావు నియోజకవర్గం నుంచి బీఎస్పిలో చేరికలు

విధాత, హైదరాబాద్: సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదని రాజ్యాంగ విరుద్దమైన పాలన కొనసాగుతుందని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గుండాయిజం, బెదిరింపులు, నిరంతర పోలీసుల నిఘాలో సిద్దిపేట ప్రజలు భయంభయంగా బతుకుతున్నారన్నారు. ఇదే సిద్దిపేట జిల్లా నుంచి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికై, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు.

సిద్దిపేట జిల్లా నుంచి వందలాది మంది ప్రజలు నేడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి, చుట్టుపక్కల గ్రామాలైన పొన్నాల, చిన్నకోడూరు, బుస్సాపూర్ తదితర గ్రామాల నుండి నేడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళల మరణానికి కారణమయ్యారని, కనీసం బాధిత మహిళల కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. రాజ్యాంగవిరుద్దమైన, మహిళలను చంపుతున్న కేసీఆర్, హరీష్ రావు విధానాలను వ్యతిరేకిస్తూ అదే జిల్లాకు చెందిన ప్రజలు నేడు భారత రాజ్యాంగాన్ని కాపాడే, ప్రజలను ప్రాణంగా ప్రేమించే బహుజన్ సమాజ్ పార్టీలో చేరారని గుర్తు చేశారు.

మనకు మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లుగా మనకు అవకాశాలివ్వకుండా, వారి బంధువులకు ఇచ్చి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఫాంహౌస్ లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తిరిగి ఇలాంటి దుర్మార్గమైన పాలన కొనసాగించేందుకు, బంధు పథకాలు పెట్టి మోసం చేయాలని చూస్తున్నారని,వారి మోసాలను తిప్పి కొట్టి బహుజన రాజ్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఏనుగు గుర్తుకే ఓటేయాలని కోరారు.

బహుజన్ సమాజ్ పార్టీ నిరుపేదలందరికి ఒక ఎకరం భూమి ఇస్తామని, బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తామని, 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో జనాభా దామాషా ప్రకారం వాటా ఇస్తామని ప్రకటించారు. జ్యోతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మంద.పాండు, కాంగ్రెస్ పార్టీ నుంచి పాషా, టీఆర్ఎస్ పార్టీ నుండి ఎల్లాగౌడ్, శ్యామల, రాధిక, సత్తవ్వ వారి అనుచరులు మహిళలు విద్యార్థులు పార్టీలో చేరారు.