‘కార్తీకదీపం’ పెట్టిన మంట.. సీరియల్ని చూడనివ్వ లేదని
వ్యక్తి చేయి కొరికిన దుకాణాదారుడు ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డాక్టర్ బాబు, దీపలను ఇక చూడలేనన్న బాధతో కార్తీక దీపం సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తుండగా అరువు కోసం విసిగించిన ఓ వ్యక్తి చేతిని కొరికి రక్తం కళ్లజూశాడు సదరు దుకాణదారుడు. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలంపేటకు […]

- వ్యక్తి చేయి కొరికిన దుకాణాదారుడు
- ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డాక్టర్ బాబు, దీపలను ఇక చూడలేనన్న బాధతో కార్తీక దీపం సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తుండగా అరువు కోసం విసిగించిన ఓ వ్యక్తి చేతిని కొరికి రక్తం కళ్లజూశాడు సదరు దుకాణదారుడు. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాలంపేటకు చెందిన గట్టు మొగిలి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇందులోనే మద్యం కూడా విక్రయిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి వెంకటయ్య జనవరి 23న రాత్రి మొగిలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు.
అనంతరం మరికొంత మద్యం ఉద్దెర కావాలని విసిగించాడు. ఈ తరుణంలో టీవీలో వస్తున్న కార్తీకదీపం సీరియల్ చూస్తున్న మొగిలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతని కుడి చేతి చూపుడు వేలిని కొరికేశాడు. ఉద్దెర అడిగిండని కోపంతో పాటు తనకిష్టమైన సీరియల్ని చూడనివ్వడం లేదని ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై వెంకటయ్య తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులు. కార్తీక దీపం చూస్తుంటే విసిగించడం తోనే దాడి చేశానని మొగిలి చెప్పిన సమాధానంతో ఖంగుతిన్నారు. మొగిలిపై కేసు నమోదు చేశారు.