Margadarsi Case | మార్గదర్శికి మద్దతుగా మాట్లాడినా నోటీసులు

మరింత జోరు పెంచిన సీఐడీ విధాత‌: తన పాలనను, అడుగడుగునా విమర్శిస్తూ, తమను నిత్యం బదనాం చేస్తున్న ఈనాడు రామోజీ రావును ఎలాగైనా దెబ్బ తీయాలి, పరువు తీసి బజార్న వేసేయాలి కంకణం కట్టుకున్న ఆంధ్ర ప్రభుత్వము, ముఖ్యంగా సీఎం జగన్ వీలున్నన్ని అవకాశాలు వెతుకుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ (Margadarsi Case) లో అక్రమాలు.. వందలకోట్ల నిధుల మల్లింపు వంటివి నిబంధనల ఉల్లంఘింపుగా గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం ఈమేరకు ఇప్పటికే సీబీసీఐడీ (CBCID) వాళ్లతో […]

Margadarsi Case | మార్గదర్శికి మద్దతుగా మాట్లాడినా నోటీసులు
  • మరింత జోరు పెంచిన సీఐడీ

విధాత‌: తన పాలనను, అడుగడుగునా విమర్శిస్తూ, తమను నిత్యం బదనాం చేస్తున్న ఈనాడు రామోజీ రావును ఎలాగైనా దెబ్బ తీయాలి, పరువు తీసి బజార్న వేసేయాలి కంకణం కట్టుకున్న ఆంధ్ర ప్రభుత్వము, ముఖ్యంగా సీఎం జగన్ వీలున్నన్ని అవకాశాలు వెతుకుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ (Margadarsi Case) లో అక్రమాలు.. వందలకోట్ల నిధుల మల్లింపు వంటివి నిబంధనల ఉల్లంఘింపుగా గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం ఈమేరకు ఇప్పటికే సీబీసీఐడీ (CBCID) వాళ్లతో విచారణ చేయిస్తోంది.

ఈ కేసులో రామోజీరావును ఏ -1 గానూ, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజను ఏ-2 గ పేర్కొంటూ కేసులు బుక్ చేసింది. అయితే ఇది జరిగిన మరుక్షణం రామోజీ రావు తన మద్దతుదారులు అయినా ఆర్ధిక నిపుణులు, లాయర్లు, సీఎంలు, ప్రొఫెసర్లను లైన్లో పెట్టి సభలు, సెమినార్ల వంటివి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శింపజేసారు.

అసలు రామోజీ, మార్గదర్శిలో ఎలాంటి తప్పు లేదని వీళ్లంతా మాట్లాడడం, దాన్ని ఈటివి, ఈనాడు పత్రికల్లో కవర్ చేయడం కూడా ఐంది. ఇక రాజకీయ నాయకులు సైతం అంటే టిడిపి వాళ్ళు కూడా రామోజీకి అండగా నిలుద్దాం అని నిర్ణయించుకుని కొందరు అచ్చం అదే తరహాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ , రామోజీని కీర్తిస్తూ ప్రకటనలు ఇచ్చారు.

దీంతో ప్రభుత్వానికి మళ్ళీ ఒళ్ళు మండింది అసలు ఏ ఆధారాలు పట్టుకుని , ఏ పాయింట్ మీద మీరంతా మార్గదర్శిలో అక్రమాలు లేవని చెబుతున్నారు. మీకు అంత నమ్మకం ఉంటె ఆ వివరాలు ఇవ్వండి అంటూ అలా మద్దతుగా మాట్లాడిన వాళ్లకు సైతం సీఐడీ నోటీసులు ఇస్తోంది. ఈమేరకు న్యాయవాది శ్రవణ్ కుమార్ వంటి వారికీ నోటీసులు ఇచ్చారు.

మార్గ‌ద‌ర్శి లో అంతా చట్టబద్ధంగా ఉందని, ఎక్కడ అక్రమాలు లేవని, కేవలం రామోజీని* Cherukuri Ramojeerao) వేధించ‌డానికే సీఐడీ తప్పుడు కేసు పెట్టింద‌ని ప్రొఫెస‌ర్ జీవీఆర్ శాస్త్రి ప్ర‌ధాని మోదీకి లేఖ రాయగా దీన్ని ఈనాడు ప్రచురించింది. ఇప్పుడు ఇలాంటి వారికీ సైతం సీఐడీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.

మార్గదర్శికి మద్దతుగా మాట్లాడితే మాత్రం నోటీస్ వెళ్తుంది.. మీకు ఈ సమాచారం ఉంది.. ఏ ఆధారంతో మార్గదర్శి కి( Margadarsi chit funds) వత్తాసు పలుకుతున్నారు చెప్పండి అని సీఐడీ నోటీసుల్లో పేర్కొంటోంది. దీంతో అయ్యో రామ ఈనాడులో కవరేజి వస్తుందని మాట్లాడితే సీఐడీ తో పోట్లాట పెట్టుకున్నాయి అయిందేమి దేవుడా అని వాళ్ళు బాధపడుతున్నారు.