లైసెన్స్ లేకుండా ఔష‌ధ అమ్మ‌కాలు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు తాఖీదులు

-మ‌రో 18 ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కూ డీసీజీఐ షోకాజ్ నోటీసులు విధాత‌: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌ ప్ల‌స్‌స‌హా 20 ఈ-కామ‌ర్స్‌ సంస్థ‌ల‌పై డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మండిప‌డింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో ఔష‌ధ అమ్మ‌కాలు జ‌రుపుతున్నారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో ఔష‌ధ అమ్మ‌కాలు నిషేధం అంటూ 2018 డిసెంబ‌ర్ 12న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం డీసీజీఐ వీజీ సోమ‌ని ఆయా ఆన్‌లైన్ మార్కెటింగ్ […]

లైసెన్స్ లేకుండా ఔష‌ధ అమ్మ‌కాలు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు తాఖీదులు

-మ‌రో 18 ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కూ డీసీజీఐ షోకాజ్ నోటీసులు

విధాత‌: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌ ప్ల‌స్‌స‌హా 20 ఈ-కామ‌ర్స్‌ సంస్థ‌ల‌పై డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మండిప‌డింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో ఔష‌ధ అమ్మ‌కాలు జ‌రుపుతున్నారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో ఔష‌ధ అమ్మ‌కాలు నిషేధం అంటూ 2018 డిసెంబ‌ర్ 12న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం డీసీజీఐ వీజీ సోమ‌ని ఆయా ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ‌ల‌కు ఈ నోటీసులు జారీ చేశారు. 2019 మే, న‌వంబ‌ర్ నెలల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల గురించి తెలియ‌ప‌ర్చామ‌ని, ఈ నెల 3న కూడా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌రోసారి కోరిన‌ట్టు తాజా నోటీసుల్లో డీసీజీఐ గుర్తుచేసింది.

ఇక డ్ర‌గ్స్ అండ్ కాస్మ‌టిక్స్ యాక్ట్ 1940 నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తున్న మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దో రెండు రోజుల్లోగా చెప్పాలంటూ ఆన్‌లైన్ మెడిసిన్ సెల‌ర్ల‌కు డీసీజీఐ స్ప‌ష్టం చేసింది. కాగా, ఆన్‌లైన్‌లో ఔష‌ధ అమ్మ‌కాలు.. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నేగాక‌, ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలగాటం కూడా అని వైద్య వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.