రెండు రోజుల్లో 1140 పోస్టులకు నోటిఫికేషన్‌: మంత్రి హరీశ్‌ రావు

విధాత‌: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో నియామకాల భర్తీపై మంత్రి హరీశ్‌ రావు శుభవార్త చెప్పారు. 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు. దీంతో పాటు పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత తీర్చడానికి వెయ్యిమంది డాక్టర్ల ను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా 10 రోజుల్లో ఆర్వర్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా […]

  • By: Somu    latest    Sep 23, 2022 10:34 AM IST
రెండు రోజుల్లో 1140 పోస్టులకు నోటిఫికేషన్‌: మంత్రి హరీశ్‌ రావు

విధాత‌: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో నియామకాల భర్తీపై మంత్రి హరీశ్‌ రావు శుభవార్త చెప్పారు. 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు.

దీంతో పాటు పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత తీర్చడానికి వెయ్యిమంది డాక్టర్ల ను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా 10 రోజుల్లో ఆర్వర్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా ఖాళీలు లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

అయితే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మాకు కావాల్సిందల్లా అత్యత్తమ వైద్య సేవలు అందించాలన్నారు. మీ సేవలకు కొలమానం ప్రజల నుంచి వచ్చే సంతృప్తే అని మంత్రి పేర్కొన్నారు.