అమరావతి పాదయాత్రకు కోర్టు ఒకే!
ఉన్నమాట: అమరావతి రైతుల పాదయాత్రను నిలువరించేందుకు.. అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.. కోర్టు మాత్రం వారికి అనుకూలంగానే తీర్పు చెబుతోంది. అయితే కేవలం రైతులు.. అది కూడా గుర్తింపు కార్డులు ఉన్నవారే యాత్రలో పాల్గొనాలని చెబుతోంది. పాదయాత్ర ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. దీని మీద కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. తీర్పుని రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు కాసేపటి క్రితం తీర్పు వెలువరించింది. రైతులు […]

ఉన్నమాట: అమరావతి రైతుల పాదయాత్రను నిలువరించేందుకు.. అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.. కోర్టు మాత్రం వారికి అనుకూలంగానే తీర్పు చెబుతోంది. అయితే కేవలం రైతులు.. అది కూడా గుర్తింపు కార్డులు ఉన్నవారే యాత్రలో పాల్గొనాలని చెబుతోంది. పాదయాత్ర ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. దీని మీద కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. తీర్పుని రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు కాసేపటి క్రితం తీర్పు వెలువరించింది.
రైతులు పాదయాత్ర చేసుకోవచ్చు అని చెబుతూనే 600 మంది వరకూ మాత్రమే పాదయాత్ర చేయవచ్చని నిబంధన విధించింది. రైతులకు పోలీసులు, ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్డులు ఉన్న రైతులే పాదయాత్రలో పాల్గొనవచ్చు అని పేర్కొంది. మరో వైపు రైతులకు సంఘీభావం తెలియచేయాల్సిన వారు దూరంగా ఉండి చేయవచ్చునని, వారు యాత్రలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. మొత్తానికి తామిచ్చిన ఆదేశాలు షరతులు ఉల్లంఘన జరగకుండా పాదయాత్ర జరిగేలా చూడాలని పేర్కొంది.
మొత్తానికి పాదయాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం కోరిన విధంగా కోర్టు నుంచి ఆదేశాలు అయితే రాలేదు. అదే సమయంలో ఆరు వందల మంది వరకూ మాత్రమే రైతులు పాదయాత్రలో పాల్గొనవచ్చు అని కోర్టు పేర్కొంది.
ఈ విధంగా చూస్తే ప్రభుత్వం అనుకున్నట్లుగా పాదయాత్ర రద్దు కాకపోవడం రైతుల విజయం అయితే అదే సమయంలో ఆరు వందల మంది కంటే ఎక్కువ రైతులు పాదయాత్రలో పాల్గొనరాదని ఆదేశించడం ద్వారా రాజకీయ నాయకుల కార్యకర్తలతో ర్యాలీగా వచ్చే అవకాశాలను కట్టడి చేసినట్లు అయిందంటు న్నారు. అంటే అటు ఇటు ఇరువర్గాల వారికి ఎవరికి నచ్చిన విధంగా వారు భాష్యం చెప్పుకునేలా తీర్పు వచ్చిందని అంటున్నారు.