భారత్‌లో మళ్లీ ఒమిక్రాన్‌ కలకలం.. హై ఆలర్ట్‌ ప్రకటించిన కేంద్రం

అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కొత్త ర‌కం వైర‌స్ BF7 దేశంలో 3 BF7 వేరియంట్‌ కేసులు గుర్తింపు! విదేశాల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులు  రద్దీ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్‌ రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం ఆదేశాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: కేంద్రం విధాత, న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కలకలం సృష్టిస్తున్నది. రెండో వేవ్‌లో దేశానికి వణికించిన వేరియంట్‌ మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నది. చైనాలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణం ఒమిక్రాన్‌ BF7 సబ్‌ […]

భారత్‌లో మళ్లీ ఒమిక్రాన్‌ కలకలం.. హై ఆలర్ట్‌ ప్రకటించిన కేంద్రం
  • అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కొత్త ర‌కం వైర‌స్ BF7
  • దేశంలో 3 BF7 వేరియంట్‌ కేసులు గుర్తింపు!
  • విదేశాల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులు
  • రద్దీ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్‌
  • రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం ఆదేశాలు
  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: కేంద్రం

విధాత, న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కలకలం సృష్టిస్తున్నది. రెండో వేవ్‌లో దేశానికి వణికించిన వేరియంట్‌ మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నది. చైనాలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణం ఒమిక్రాన్‌ BF7 సబ్‌ వేరియంట్‌ ప్రధానకారణంగా భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ కేసులను ఇప్పటివరకు భారత్‌లో మూడు గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వేరియంట్‌ను తొలిసారిగా భారత్‌లోనే గుర్తించారు.

అక్టోబర్‌లో గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ BF7 వేరియంట్‌ను గుర్తించింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసులు గుజరాత్‌లో, మరొకటి ఒడిశాలో నమోదైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు పలుదేశాల్లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్నది. చైనాలోని పలు నగరాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని పలు నగరాల్లో కేసులు పెరుగుతుండగా.. ఇందుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా తెలుస్తున్నది. వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్‌ సోకుతున్నట్లు గుర్తించారు.

ఇప్పటికే యూఎస్‌, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ సహా పలు యూరోపియన్‌ దేశాల్లోనూ ఈ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. కొవిడ్‌ పరిస్థితులపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ను ప్రకటించింది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి, వైరస్‌ను కట్టడి చేయాలని సమావేశంలో ఉన్నతాధికారులు సూచించారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ కోరారు. అయితే, ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కేసులు పెరగడం లేదని, అయినా అభివృద్ధి చెందుతున్న వేరియంట్లను ట్రాక్‌ చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శలు, ఆయుష్, ఫార్మాస్యూటికల్స్ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్, జాతీయ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) చైర్మన్ అరోరా, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

భేటీలో ముఖ్యంగా ఆరు ప్రధాన అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ఇన్‌కమింగ్ కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మార్గదర్శకాలను రూపొందించడం, కొవిడ్ కొత్త వేరియంట్‌పై నిపుణులతో సంప్రదింపులు తదితర అంశాలపై చర్చించనట్లు తెలుస్తున్నది. మరో వైపు మంగళవారం కొత్త వేరియంట్లను గుర్తించేందుకు రాష్ట్రాలు నమూనాలను జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ చేయాలని, INSACOG ల్యాబ్‌లకు పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ప్రస్తుతానికి విదేశీ రాకపోకలపై ఆంక్షలు లేవు

ప్రస్తుతానికి విదేశాల నుంచి రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెప్పింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ కేసులు అదుపులోనే ఉన్నాయని, క్రియాశీల కేసులు ఐదువేలకు దిగువనే ఉన్నాయని పేర్కొంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికాలో కొవిడ్‌ కేసుల సంఖ్య మొత్తం 10కోట్లు దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆయా దేశాల్లో కోవిడ్‌ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.. తద్వారా వైరస్ పరివర్తన చెందినట్లయితే, కొత్త వేరియంట్‌ను గుర్తించవచ్చని స్పష్టం చేసింది.

వయోధికులు బూస్టర్‌ డోస్‌

వయోధికులకు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని కేంద్రం కోరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్ననేపథ్యంలో వయోధికులు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని తెలిపింది. బూస్టర్‌డోస్ వేసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొంద వచ్చ‌ని తెలిపింది. దేశంలో 28 శాతం ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పింది.

రీ ఇన్‌ఫెక్ష‌న్ చేసే శ‌క్తి ఉన్న ఈ కొత్త‌ వేరియంట్ తీవ్ర‌ ప్ర‌మాద‌కారి

కొవిడ్ కొత్త ర‌కం వేరియంట్ బీఎఫ్‌7 కొవిడ్19 వేరియంట్ ఒమిక్రాన్‌ నుంచి ఉప ర‌కంగా ఉద్భ‌వించింది. ఒమిక్రాన్‌ను మ‌నం బీఏ5 అంటాం. దీన్నుంచే బీఎఫ్ 7 పుట్టింది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెంద‌ట‌మే కాకుండా ఒక సారి కొవిడ్ సోకిన వారికి కూడా ఇది తిరిగి సోకుతుంది. అంటే రీ ఇన్‌ఫెక్ష‌న్ శ‌క్తి దీనికి ఎక్క‌వ. ఈ కార‌ణం చేత‌నే ఇది అత్యంత ప్ర‌మాద‌కారిగా మారింది.

గ‌తంలో అయితే.. ఒక సారి క‌రోనా సోకిన వారికి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి తిరిగి క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఏర్ప‌డేది కాదు. అలాగే.. టీకా తీసుకున్న‌వారు సుర‌క్షితులుగా భావించే వాళ్లం. కానీ కొత్త ర‌కం క‌రోనా వేరియంట్ బీఎఫ్ 7 ప్ర‌తి ఒక్క‌రికీ సోకుతుంది.

చైనాలో రోజుకు క‌రోనా బాధితుల సంఖ్య వంద‌లు వేల నుంచి ల‌క్ష‌ల్లోకి చేరుతున్న‌ది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే రానున్న రోజుల్లో చైనాలో 60 శాతం మంది క‌రోనా బారిన ప‌డ‌తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఇప్ప‌టికే బీఎఫ్ 7 చైనాతో పాటు… కొరియా, అమెరికా, ఇంగ్లండ్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్ ఇత‌ర యూర‌ప్ దేశాల్లో కూడా ఈ వైర‌స్ క‌నిపించ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్న‌ది.